జూబ్లీహిల్స్ గడ్డపై ఎగిరిన ‘హస్తం’ జెండా - విజయానికి 5 ప్రధాన కారణాలు..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విక్టరీ కొట్టేసింది. ముందు నుంచే పక్కాగా అడుగులు వేసిన ఆ పార్టీ... భారీ విజయాన్నే అందుకోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో మరింత పట్టును పెంచుకోగలిగింది. కాంగ్రెస్ విజయానికి గల కారణాలు ఇక్కడ తెలుసుకోండి

Published on: Nov 14, 2025, 13:22:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్ గడ్డపై హస్తం జెండా రెపరెపలాడింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఉపఎన్నికను ముందు నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ…. అప్రమత్తంగా వ్యవహరించింది.

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం - కారణాలు
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం - కారణాలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత ఈ ఉపఎన్నిక రావటంతో రేవంత్ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ గా మారింది. ఎలాగైనా ఈ బైపోల్ లో గెలిచి…. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావించింది. హైదరాబాద్ నగరంలో కూడా పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగానే గతంలో కంటోన్మెంట్ లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ…. ప్రస్తుతం జరిగిన జూబ్లీహిల్స్ లోనూ జెండాను ఎగరవేసింది.

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విక్టరీ - 5 ప్రధాన కారణాలు

  1. జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత సవాల్ గా తీసుకుంది. ఏ చిన్న తప్పదానికి అవకాశం ఇవ్వొద్దని భావించింది. మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు కీలక నేతలతో కమిటీలు ఏర్పాటు పకడ్బందీగా వ్యవహరించింది. నోటిఫికేషన్ రాకముందు నుంచే పక్కాగా అడుగులు వేసింది.
  2. అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఆచితూచీ వ్యవహరించింది. అనేక పేర్లు పరిశీలించినప్పటికీ బీసీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. నవీన్ యాదవ్ స్థానికుడు కావటంతో పాటు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి మంచి ఓట్లను సాధించారు. ఆ తర్వాత స్వతంత్రంగా కూడా పోటీ చేసిన చెప్పుకోదగ్గ ఓట్లను సాధించారు. దీంతో నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ కు అత్యంత కలిసివచ్చింది.
  3. ఎంఐఎంను పోటీలో లేకుండా చేయటంలో కూడా కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపి పోటీలో లేకుండా చేయటంతో ముస్లిం ఓట్లను తమవైపు తిప్పుకోగలిగింది. ఎంఐఎం పోటీలో ఉంటే ఓట్లు చీలి ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఉంటుందని భావించి... ఎంఐఏంతో చర్చలు జరిపి నవీన్ యాదవ్ కు మద్దతు ఇచ్చేలా చేసింది. దీనితోడు అజహరుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవటం వంటి నిర్ణయం కూడా ఇంతో కొంత లాభం చేకూర్చింది.
  4. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఉపఎన్నికను అత్యంత సవాల్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి... జూబ్లీహిల్స్ గల్లీల్లో రోడ్ షోలు నిర్వహించారు. కార్నర్ మీటింగ్స్ లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. పదునైన డైలాగ్స్ తో ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేశారు.
  5. పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ తిరుగులేని విధంగా వ్యవహరించింది. ప్రత్యర్థి పార్టీల అంచనాలకు మించి పార్టీ నాయకత్వం పని చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు డివిజన్ల వారీగా ప్రతిదీ పర్యవేక్షిస్తూ వచ్చింది. కాంగ్రెస్ విజయంలో పోల్ మేనేజ్మెంటే అత్యంత కీలకమైందని పలువురు విశ్లేషిస్తున్నారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More