...
...
Next Story

Shabad Six Murders Case : దైవాలగూడలో అర్ధరాత్రి వరుస హత్యలు - అసలేం జరిగింది..?

Shabad Six Murders Case : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఘోరం జరిగింది. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో బెయిల్‌పై వచ్చిన నిందితుడు రాజ్ కుమార్… ఆరుగురిని కిరాతకంగా నరికి చంపేశాడు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published on: Jul 11, 2026 11:57 AM IST
Advertisement

Shabad Six Murders Case : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో అత్యంత దారుణమైన మారణకాండ వెలుగుచూసింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ వ్యక్తి… అత్యంత క్రూరంగా మారిపోయాడు. ఒకే రాత్రి రెండు గంటల వ్యవధిలో కన్నబిడ్డలు, భార్యతో సహా మొత్తం ఆరుగురిని బలితీసుకున్నాడు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

పోక్సో కేసు కక్షే కారణం!

అర్ధరాత్రి వరుస హత్యలు - అసలేం జరిగింది..? (image source pixel)
అర్ధరాత్రి వరుస హత్యలు - అసలేం జరిగింది..? (image source pixel)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ (28) అనే వ్యక్తి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను వేధింపులకు గురిచేశాడు. దీనిపై సదరు బాలిక తల్లి మే 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన షాబాద్ పోలీసులు, మే 26వ తేదీన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కేవలం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లను మాత్రమే ఈ కేసులో జత చేయడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఫలితంగా నిందితుడు రాజ్ కుమార్‌కు వెంటనే బెయిల్ వచ్చినట్లు బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు…. కేసు పెట్టిన వారిపై పగ పెంచుకుని ఈ ఘోరానికి ఒడిగట్టాడని చెబుతున్నారు.

రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు.. సాగిన మారణకాండ

నిందితుడు రాజ్ కుమార్ పక్కా ప్రణాళికతో గురువారం రాత్రి ఈ దారుణాలకు పాల్పడ్డాడు. రాత్రి 11 గంటల సమయంలో మొదట షాబాద్‌లోని బాధితురాలి ఇంట్లోకి కత్తితో చొరబడ్డాడు. అడ్డువచ్చిన బాలిక తల్లిని, నానమ్మను (మరో సమాచారం ప్రకారం అమ్మమ్మ, నానమ్మ) అక్కడికక్కడే అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం ఆ ఇంట్లోని బాలికను బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. బాలికను అక్కడి నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల్లోని ఒక చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, ఆపై గొంతు కోసి హత్య చేశాడు.

కన్నవారిని కూడా వదల్లేదు..

ఆరుగురిని హతమార్చిన అనంతరం నిందితుడు రాజ్ కుమార్ కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. పారిపోతూ తన తండ్రికి ఫోన్ చేసి తాను చేసిన హత్యల వివరాలను చెప్పాడు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైన రాజ్ కుమార్ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

"రాత్రి హత్యలు జరిగినట్లు మాకు సమాచారం అందింది. మొదట షాబాద్‌లోని బాధితురాలి ఇంట్లోకి రాత్రి 11 గంటలకు రాజ్ కుమార్ వెళ్లాడు. కత్తితో బాలిక తల్లిని, నాయనమ్మను చంపాడు. ఆ తర్వాత బాలికను చెరువు దగ్గరికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలను చంపాడు," అని సీపీ తరుణ్ జోషి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడు రాజ్ కుమార్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడని…. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.

ఈ వరుస హత్యల నేపథ్యంలో బాలిక బంధువులు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. హత్యలకు పోలీసుల అలసత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. మే 16వ తేదీన రాజ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశామని బాలిక కుటుంబసభ్యులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. రాజ్‌కుమార్ బయటే తిరుగుతూ చాలా సార్లు బెదిరించాడని… ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.

నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలోనూ ఓ కేసు ఉన్నట్లు తెలుస్తోంది. భూవివాదంలో రాజ్‌కుమార్ ఇద్దరిని కొట్టి బెదిరించగా…. షాబాద్ పీఎస్‌లోనే కేసు నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe