...
...
Next Story

TG Inter Hall Ticket 2026 : తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు ఎప్పుడు..? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?

తెలంగాణ ఇంటర్ పరీక్షల సమయం దగ్గరపడింది. ఈనెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

Published on: Feb 16, 2026, 07:22:19 IST
Advertisement

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. పరీక్షల నిర్వహణకు సమయం కూడా దగ్గరపడింది. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. అయితే హాల్ టికెట్ల కోసం విద్యార్థులు ఎదురుచూస్తుండగా… ఏ క్షణంలోనైనా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఇంటర్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇంటర్ పరీక్షలు (image source istock)
ఇంటర్ పరీక్షలు (image source istock)

ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన నమూనా హాల్ టికెట్లను(ప్రివ్యూ) కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఏమైనా తప్పులు దొర్లితే సవరించుకునే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించారు. పలువురు విద్యార్థులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు. హాల్ టికెట్ల జారీపై కసరత్తు పూర్తి కాగా…. ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచేందుకు సాఫ్ట్ వేర్ ను కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా హాల్ టికెట్లు విడుదలవుతాయి.

టీజీ ఇంటర్ పరీక్షలు - హాల్ టికెట్లు డౌన్లోడ్ ఎలా..?

  • విద్యార్థులు https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో ఐపీఈ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ లింక్స్ డిస్ ప్లే అవుతాయి.
  • ఫస్ట్ ఇయర్ విద్యార్థులు టెన్త్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ కనిపిస్తుంది.
  • సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి హాల్ టికెట్ ను పొందొచ్చు.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

మరోవైపు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కీలక సూచనలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలనిఆదేశించింది.పరీక్షలు జరిగే ప్రతి హాల్‌లో వాల్‌ క్లాక్ (గోడ గడియారం) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఇక పరీక్షల్లో పారదర్శకత, భద్రత కోసం అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేయనున్నారు.

టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026:

  • 25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
  • 27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
  • 02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
  • 5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
  • 9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
  • 12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
  • 17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:

  • 26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
  • 28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
  • 04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
  • 6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
  • 10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
  • 13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
  • 16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
  • 18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks