ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక జూనియర్ కాలేజీల్లోనూ మిడ్ డే మీల్స్!
ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజన పథకాలను విస్తరించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి యోచిస్తోంది.
ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. విద్యార్థులను ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా రాబోయే విద్యా సంవత్సరం(2026–27) నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపింది యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థిక, పరిపాలనా పరిశీలనలో ఉందని ఇంటర్ విద్యా మండలి అధికారులు తెలిపారు. తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులతో సమానంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ప్రయోజనాన్ని అందించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదిత పథకం తెలంగాణ అంతటా దాదాపు 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమం అంచనా వ్యయం సంవత్సరానికి సుమారు రూ. 180 కోట్లు, ఆహారం, పోషకాహార సప్లిమెంట్లతో సహా ఒక్కో విద్యార్థికి దాదాపు రూ. 13.5 ఖర్చు అవుతుంది. పైలట్ కార్యక్రమాలలో భాగంగా కొండంగల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఇదే నమూనాను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకునే ముందు అధికారులు ప్రస్తుతం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల ప్రభావం, సాధ్యాసాధ్యాలను సమీక్షిస్తున్నారు. ఈ పథకాలను జూనియర్ కళాశాలలకు విస్తరించడం వల్ల డ్రాపౌట్ రేట్లు తగ్గుతాయని, ప్రభుత్వ సంస్థలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నమోదు పెరుగుతుందని ఇంటర్ విద్యామండలి అధికారులు అధికారులు భావిస్తున్నారు.
మధ్యాహ్న భోజన కార్యక్రమం విద్యార్థుల శారీరక, మానసిక శ్రేయస్సును బలోపేతం చేసే దిశగా ఒక అడుగు అని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల జరిగిన చర్చల సందర్భంగా చాలా కాలేజీలు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో ఉన్నాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలు తప్పనిసరి అని తెలియజేశారు. ఈ పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. బడ్జెట్ ఆమోదానికి లోబడి ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


