...
...
Next Story

జూబ్లీహిల్స్ బైపోల్ 2025 : ఫైనల్ రేసులో ఆ ముగ్గురు...! బీజేపీ అభ్యర్థి ఎవరు..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. అయితే బీజేపీ అభ్యర్థి ఎవరునేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఫైనల్ లిస్టులో ముగ్గురు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Published on: Oct 12, 2025, 07:02:08 IST
Advertisement

రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. ఈ బైపోల్ తో మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్… ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి... జనంలోకి వెళ్తున్నాయి. అయితే బీజేపీ నుంచి ఎవరు అభ్యర్థిగా ఉంటారనేది తేలాల్సి ఉంది.

అభ్యర్థిగా ఎవరు…?

జూబ్లీహిల్స్ బైపోల్ 2025 : ఫైనల్ రేసులో ఆ ముగ్గురు...! బీజేపీ అభ్యర్థి ఎవరు..?
జూబ్లీహిల్స్ బైపోల్ 2025 : ఫైనల్ రేసులో ఆ ముగ్గురు...! బీజేపీ అభ్యర్థి ఎవరు..?

బీజేపీకి ఈ ఉపఎన్నిక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకెల దీపక్​రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేకాకుండా కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురి పేర్లు ఫైనల్ లిస్టులో ఉన్నట్లు కూడా తెలిసింది.

ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి కాగా.. ఫైనల్ రేసులో ఉన్న అభ్యర్థులతో కూడిన లిస్టును పార్టీ పెద్దలకు పంపించారు. ఈ షార్ట్ లిస్టులో ముగ్గురు పేర్లు ఉండగా... వీరిలో ఒకరి పేరు ఖరారు కానుంది. టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా వ్యక్తులు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సిందేనని పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆదేశాలనిచ్చింది. అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని తేల్చి చెప్పింది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రాధాన్యంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ... ఈ ఎన్నికను సమర్థంగా సమన్వయం చేసేందుకు ఉప ఎన్నిక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అభ్యర్థి ఎంపిక నుంచి… బూత్ స్థాయి కార్యకలాపాల వరకు ఎన్నికల వ్యూహాలను సమన్వయం చేసే బాధ్యతలు చూస్తోంది. స్థానిక సమస్యలను సేకరించడం, ప్రచారాన్ని సమర్ధవంతంగా నడిపించడం వంటి బాధ్యతలను ఈ కమిటీ చేపట్టే పనిలో ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe