వినియోగదారులకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా Telangana Southern Power Distribution Company Limited(TGSPDCL) బుధవారం నుంచి ఒక కీలకమైన డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియను మెుదలుపెట్టింది. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతిక లోపాలను వేగంగా గుర్తించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

మొదటి దశలో భాగంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో ఈ డిజిటల్ మ్యాపింగ్‌ను అమలు అవుతుంది. ఈ సరికొత్త విధానం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి వినియోగదారుడి ఇంటి వరకు ఉండే పూర్తి నెట్‌వర్క్‌ను డిజిటల్‌గా అనుసంధానం చేస్తారు.
132/33 కేవీ ఈహెచ్‌టీ (EHT) సబ్‌స్టేషన్ల నుండి 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 11 కేవీ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (DTR) మీదుగా.. ప్రతి వినియోగదారుడి సర్వీస్ కనెక్షన్ వరకు ఉండే మొత్తం నెట్‌వర్క్‌ను ఆన్‌లైన్ మ్యాప్‌లోకి తెస్తారు. విద్యుత్ శాఖ ఫీల్డ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్ల కోడ్‌లను ఫీడర్ల వారీగా తనిఖీ చేస్తారు.
జులై నెల బిల్లింగ్ సమయంలో మీటర్ రీడర్లు ప్రతి ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలోని ఇళ్లను సందర్శించి, వినియోగదారుల సర్వీస్ కనెక్షన్‌లను కచ్చితంగా మ్యాప్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. ఏ వినియోగదారుడికి ఏ సబ్‌స్టేషన్, ఏ ఫీడర్, ఏ ట్రాన్స్‌ఫార్మర్ నుండి కరెంట్ వస్తుందో కంప్యూటర్ స్క్రీన్‌పై స్పష్టంగా తెలిసిపోతుంది.
ఇకపై వినియోగదారులు 1912 కాల్ సెంటర్, వాట్సాప్, మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కరెంట్ పోయిందని ఫిర్యాదు చేయగానే.. సమస్య ఎక్కడ ఉందో సిస్టమ్ వెంటనే గుర్తిస్తుంది. దీనివల్ల చాలా వేగంగా కరెంట్‌ను పునరుద్ధరించడానికి వీలవుతుంది. అంతేకాకుండా కరెంట్ ఎందుకు పోయింది? ఎప్పటివరకు వస్తుంది? అనే వివరాలను కూడా పారదర్శకంగా తెలుసుకోవచ్చు.
ఈ డిజిటల్ నెట్వర్క్ వల్ల విద్యుత్ అంతరాయాలను ముందే గుర్తించవచ్చు. నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు లోడ్ మేనేజ్మెంట్ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. భవిష్యత్తులో స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ముందస్తు హెచ్చరికల సాంకేతికతను ప్రవేశపెట్టడానికి ఈ డిజిటల్ మ్యాపింగ్ ఒక బలమైన పునాదిగా మారనుంది. TGSPDCL ఆధునీకరణలో ఇదొక కీలక మైలురాయిగా నిలవనుంది.
{{/usCountry}}ఈ డిజిటల్ నెట్వర్క్ వల్ల విద్యుత్ అంతరాయాలను ముందే గుర్తించవచ్చు. నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు లోడ్ మేనేజ్మెంట్ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. భవిష్యత్తులో స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ముందస్తు హెచ్చరికల సాంకేతికతను ప్రవేశపెట్టడానికి ఈ డిజిటల్ మ్యాపింగ్ ఒక బలమైన పునాదిగా మారనుంది. TGSPDCL ఆధునీకరణలో ఇదొక కీలక మైలురాయిగా నిలవనుంది.
{{/usCountry}}