...
...
Next Story

హైదరాబాద్ లో దారుణం - భార్యకు నిప్పు పెట్టిన భర్త… అడ్డుకోబోయిన కూతురిని కూడా..!

హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. భర్త అతికిరాతంగా హత్య చేశాడు. దాడి చేయడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో కుమార్తె కూడా గాయపడింది.

Published on: Dec 26, 2025, 12:26:11 IST
Advertisement

హైదరాబాద్ నగరంలోని నల్లకుంట పరిధిలో దారుణం వెలుగూ చూసింది. కుటుంబ కలహాలతో భార్యను భర్త హతమార్చాడు. తీవ్రంగా దాడి చేయటమే కాకుండా…. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. మంటల దాటికి భార్య మృతి చెందగా… ఈ ఘటనలో కుమార్తె కూడా గాయపడింది.

భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త
( Representative image of fire.)
భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త ( Representative image of fire.)

ప్రాథమిక వివరాల ప్రకారం…. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేశ్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉండగా… ప్రస్తుతం నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం పాటు బాగానే ఉన్నప్పటికీ… ఆ తర్వాత భార్యపై వెంకటేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఏదో ఓ రకంగా వేధిస్తూ గొడవపడేవాడు. ఇటీవలే భర్త వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత త్రివేణిని భర్త వెంకటేశ్ తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు.

ఎప్పటిలాగే మరోసారి భార్యతో గొడవపడిన వెంకటేశ్… త్రివేణిపై దాడి చేశాడు. విచక్షణ మరిచి… పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అడ్డుకున్న కుమార్తెను కూడా మంటల్లో తోసేసి… అక్కడ్నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి… మంటలను అర్పేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే త్రివేణి ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది.

కేసు నమోదు చేసుకున్న నల్లకుంట పోలీసులు… నిందితుడు వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. జైలుకు తరలించారు. త్రివేణిని అత్యంత దారుణంగా చంపేయటంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe