...
...
Next Story

ఈనెల 21న అతిపెద్ద ధ్యాన కేంద్రంలో 'వరల్డ్ మెడిటేషన్ డే' - మీరు కూడా పాల్గొనొచ్చు, రిజిస్ట్రేషన్ లింక్ ఇదిగో

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈనెల 21న హార్ట్‌ఫుల్‌నెస్ ప్రధాన కార్యాలయంలో ధ్యాన సాధకులు సమావేశం కానున్నారు. దాదాపు 40,000 మంది కన్హా శాంతివనంలో ప్రత్యక్షంగానూ.. అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్‌లైన్‌లోనూ ధ్యానం చేస్తారు. https://hfn.link/meditatio లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Published on: Dec 19, 2025, 16:19:17 IST
Advertisement

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ధ్యాన సాధకులు డిసెంబర్ 21న హార్ట్‌ఫుల్‌నెస్ ప్రధాన కార్యాలయం అయిన కన్హా శాంతి వనంలో(హైదరాబాద్ శివారు) సమావేశమవుతారు. ఈ మహత్తరమైన ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హార్ట్‌ఫుల్‌నెస్ మార్గదర్శి మరియు శ్రీరామ చంద్ర మిషన్ అధ్యక్షులు దాజీ హాజరుకానున్నారు.

దాజీ మార్గదర్శకత్వంలో ధ్యానం….

ప్రపంచ ధ్యాన దినోత్సవం - అతిపెద్ద ధ్యాన కేంద్రంలో వేడుక
ప్రపంచ ధ్యాన దినోత్సవం - అతిపెద్ద ధ్యాన కేంద్రంలో వేడుక

దాజీ మార్గదర్శకత్వంలో దాదాపు 40,000 మంది కన్హా శాంతివనంలో ప్రత్యక్షంగానూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్‌లైన్‌లోనూ ధ్యానం చేయడానికి ఈకార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఆయన ధ్యానాన్ని ప్రాణహుతి ద్వారా కొనసాగిస్తారు, ఇది హార్ట్‌ఫుల్‌నెస్‌ యొక్క అద్వితీయమైన ప్రాచీన సాంకేతిక ప్రక్రియ. ఈ కార్యక్రమం భారతదేశ అపూర్వ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక వైభవంగా గుర్తించబడుతుంది.

"ధ్యానాన్ని సులభతరం చేయడం మరియు అందుబాటులోకి తేవడమే కాకుండా, దానిని వీలైనంత ఎక్కువ మంది తమ రోజువారీ జీవితంలో ఒక భాగంగా అనుసరించేలా చైతన్యవంతం చేయడం మా పని. ఒక వ్యక్తి ధ్యానం చేసినప్పుడు, అది అతనిలో అపారమైన సానుకూల మార్పును తీసుకువస్తుంది, తద్వారా ఆ సానుకూలతను అతను తన చుట్టూ ప్రసరింపజేస్తాడు. అలా ఒకేసారి ఒక మిలియన్ మంది ధ్యానం చేస్తే ఏమి జరుగుతుందో ఊహించండి. ఇది ప్రపంచాన్ని అద్భుతంగా మారుస్తుంది. నిజమైన అర్థంలో వికాసం అంటే ఇదే " అని హార్ట్‌ఫుల్‌నెస్ మార్గదర్శి, శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు అయిన పూజ్య దాజీ అన్నారు.

ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు మరియు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనవచ్చు. గత శతాబ్దంలో జన్మించిన శ్రీ రామచంద్ర మిషన్‌ యొక్క మొదటి మాస్టర్ అయిన లాలాజీ మహారాజ్ తిరిగి కనుగొన్న ప్రాణహుతి అనే అద్వితీయమైన ప్రాచీన సాంకేతిక ప్రక్రియ ఈ ఉచిత ధ్యాన సిట్టింగ్‌లో ప్రసారం చేయబడుతుంది. మాస్టర్స్ పరంపరలో రెండవవారైన బాబూజీ మహారాజ్ నాయకత్వంలో హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం ప్రపంచ శక్తిగా ఎదిగింది.

హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ సాధారణ ధ్యాన పద్ధతులను మరియు జీవనశైలి మార్పులను అందిస్తుంది. ఇది మొదటగా 20వ శతాబ్దం ప్రారంభంలో అభివృద్ధి చేయబడి, శాంతి, ఆనందం మరియు జ్ఞానాన్ని ప్రతి హృదయానికి ఒకేసారి అందించాలనే లక్ష్యంతో 1945లో భారతదేశంలో శ్రీ రామ చంద్ర మిషన్ ఈ బోధనను క్రమబద్దీకరించడం జరిగింది. ఈ సాధనలు, ఆధునిక రూపంలో యోగా, సంతృప్తి, అంతర్గత ప్రశాంతత, నిశ్చలత, కరుణ, ధైర్యం మరియు ఆలోచనలో స్పష్టతకు మద్దతుగా రూపొందించబడ్డాయి.

ఇవి సరళమైనవి మరియు సులభమైనవి. పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అన్ని వర్గాల ప్రజలు, సంస్కృతులు, మత విశ్వాసాలు మరియు ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా వీటిని అనుసరించవచ్చు. హార్ట్‌ఫుల్‌నెస్ సాధనలో శిక్షణ, వేలాది పాఠశాలలు మరియు కళాశాలల్లో కొనసాగుతోంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కార్పొరేషన్‌లు, ప్రభుత్వేతర సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలలో 100,000 మందికి పైగా వృత్తి నిపుణులు ధ్యానం చేస్తున్నారు. 160 దేశాలలో ఉన్న 5000 కంటే ఎక్కువ హార్ట్‌ఫుల్‌నెస్ సెంటర్‌లకు అనేక వేలమంది స్వచ్ఛంద ధృవీకృత శిక్షకులు (సర్టిఫైడ్ వాలంటీర్ ట్రైనర్లు) మరియు లక్షలాది సాధకులు తమ మద్దతును అందిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks