జూబ్లీహిల్స్ బైపోల్ రాజకీయం హీటెక్కింది. రోజురోజుకు అధికార, ప్రతిపక్షాలు విమర్శలతో ప్రచారాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది మూడు ప్రధాన పార్టీలు మరింత జోరుగా రంగంలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక అంశం యువతే కావచ్చని నిపుణులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకారం.. నియోజకవర్గంలోని 4,01,365 మంది ఓటర్లలో యువత కూడా భారీగానే ఉన్నారు.

1,30,042 మంది 18 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు, ఇందులో దాదాపు 85 శాతం మంది విద్యావంతులు. మరో 46,716 మంది ఓటర్లు 36 నుంచి 40 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు.
ఈ ఓటర్లను ఆకర్శించడానికి రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు ఐటీ నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియాపై పట్టు ఉన్న టీమ్స్‌ను నియమించుకున్నాయి. యువతను చేరుకునేందుకు ఉన్న మార్గాల కోసం భారీగా ఎత్తున్న ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంమది. యువత కోసం కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తున్నాయి. యువత సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటంతో, డిజిటల్ ప్రచారాలను వేదికగా చేసుకుంటున్నాయి పార్టీలు.
మెుత్తం ఓటర్లలో 1,53,848 మంది 40 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసుగల ఓటర్లు కూడా కీలలక పాత్ర పోషిస్తారు. ఇందులో జీతాలు పొందే ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 62,499 మంది ఓటర్లు 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
మధ్య వయస్కులైన ఓటర్లను ఆకర్శించేందుకు పార్టీలు సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నాయి. పాలక పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం గురించి చెబుతోంది. బీఆర్ఎస్ పార్టీ తమ హయాంలోని కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను గుర్తు చేస్తోంది. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది.
పోలింగ్‌కు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. 30 నుంచి 39 వయసు గల వారిలో 96,185 మంది ఓటర్లు ఉన్నారు. 40 నుంచి 49 సంవత్సరాల వయస్సు గలవారు 87,492, 50 నుంచి 59 మధ్య 67703 మంది ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయసు ఓటర్లు 12,380 మంది ఉన్నారు. 20 నుంచి 29 ఏళ్ల వయస్సు వారు 72540 మంది ఓటర్లు ఉన్నారు.
{{/usCountry}}పోలింగ్‌కు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. 30 నుంచి 39 వయసు గల వారిలో 96,185 మంది ఓటర్లు ఉన్నారు. 40 నుంచి 49 సంవత్సరాల వయస్సు గలవారు 87,492, 50 నుంచి 59 మధ్య 67703 మంది ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయసు ఓటర్లు 12,380 మంది ఉన్నారు. 20 నుంచి 29 ఏళ్ల వయస్సు వారు 72540 మంది ఓటర్లు ఉన్నారు.
{{/usCountry}}ఈ మేరకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. విద్యార్థులు, మెుదటిసారి ఓటర్లు నేరుగా చేసుకోవడానికి యూత్ టీమ్స్‌ను ఏర్పాటు చేశాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో యువత ఓట్లు చాలా కీలకం కానున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు వారిని ప్రసన్నం చేసుకుంటున్నాయి.