'తల్లికి వందనం' స్కీమ్ అమలు - ఈ 10 విషయాలు తెలుసుకోండి
తల్లికి వందనం స్కీమ్ పట్టాలెక్కింది. అర్హులైన వారి ఖాతాలోకి డబ్బులు జమవుతున్నాయి. ఒక్కో తల్లి ఖాతాలోకి రూ.15వేల చొప్పున విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో రూ.2వేలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమచేస్తారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం… తల్లికి వందనం స్కీమ్ కు శ్రీకారం చుట్టింది. తల్లుల ఖాతాలోకి డబ్బుల జమపై ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అర్హులు, అనర్హుల జాబితాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యంతరాలను కూడా స్వీకరించేందుకు గడువును ప్రకటించింది.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ స్కీమ్ కు గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి
తల్లికి వందనం స్కీమ్ - 10 ముఖ్యమైన విషయాలు
- ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ ను ప్రారంభించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది.
- ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తారు. వీటిలో రూ. 2 వేలు కట్ కాగా.. రూ 13 వేలు తల్లుల ఖాతాల్లో జమవుతాయి. రూ.2వేలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమచేస్తారు.
- 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. వీరిలో వెరిఫికేషన్ పూర్తి అయిన వారిని అర్హులుగా గుర్తించారు. ముందుగా 54,94,703 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. గురువారం(జూన్ 12) నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
- గ్రామ సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శిస్తారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే జూన్ 20వ తేదీ వరకు ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటిని పునఃపరిశీలిస్తారు. అర్హులైన వారిని గుర్తిస్తారు. మరో జాబితాను సిద్ధం చేస్తారు. జూన్ 21 నుంచి 28 తేదీల మధ్య ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.
- గ్రీవెన్స్ లో పరిశీలన పూర్తి అయిన తర్వాత… అర్హులను గుర్తిస్తారు. ఈ అదనుపు జాబితాను జూన్ 30వ తేదీన విడుదల చేస్తారు. వీరికి జూలై 5వ తేదీన నిధులను జమ చేస్తారు.
- తల్లికి వందనం పథకం స్టేటస్ చెకింగ్ కు ఆప్షన్ ప్రజలకు లేదు. అర్హులు మరియు అనర్హులు జాబితా సచివాలయం నోటీసు బోర్డులోనే ఉంచుతారు. విద్యార్థుల తల్లిదండ్రులు వీటిని పరిశీలించి అభ్యర్థనలను తెలియజేవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
- విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా ఈ స్కీమ్ ను వర్తింపజేస్తారు. వీరి సంఖ్య రాష్ట్రంలో 70 వేలకుపైగా ఉంది.
- హౌస్‌హోల్డ్ డేటాలో లేనివారి విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి వివరాలను మరోసారి తనిఖీ చేసి నిధులను జమ చేస్తారు. ఇలాంటి వారి సంఖ్య లక్షకు పైగా ఉంది.
- పది వేల ఆదాయం లోపు వున్న తెల్ల రేషన్కార్డుదారులకు, నెలకు 300 యూనిట్ల కరెంట్ బిల్లు దాటకుండా ఉండే కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తింపజేస్తారు. 75 శాతం అటెండెన్స్ ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని ధృవపత్రాలు, ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే డబ్బులు జమవుతాయి.
- ఇంట్లో ఫోర్ వీలర్ (ట్యాక్స్, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు) ఉంటే అనర్హులవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండొద్దు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా స్కీమ్ వర్తింపజేయరు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


