సంక్రాంతి పండగ సందడి.. సముద్రంలో మత్స్యకారులకు పడవ పోటీలు!

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో సముద్రంలో పడవ పోటీలు నిర్వహించారు.

Published on: Jan 14, 2026, 21:50:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మాడనూరు పెద్దపాలెం గ్రామంలో మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోట్‌ రేస్‌, ఈత, రంగోలీల పోటీలు నిర్వహించారు. బోట్ రేస్ పోటీలో 14 జట్లు పాల్గొన్నాయి. ఒక్కో బోటులో ఇద్దరు చొప్పున మొత్తం 28 మంది ఉన్నారు. మడనూరు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఇక్కడికి వచ్చారు.

సముద్రంలో పడవ పోటీలు
సముద్రంలో పడవ పోటీలు

పట్టపుపాలెం, పెద పట్టపుపాలెం, ఈతముక్కల పల్లె పాలెం, వాజిరెడ్డి పాలెం, మదనూరు పాలెంపాలెం, మాడనూరు తదితర మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ పడవ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సముద్రంలో పడవ పోటీలు కన్నుల పండువగా నిర్వహించారు. 14 పడవల్లో మత్స్యకారులు ఉత్సహంగా పోటీల్లో పాల్గొన్నారు.

ఈ పోటీల్లో భాగంగా సముద్రంలో 500 మీటర్ల దూరంలో ఉన్న జెండాను తీసుకు వచ్చి తీరం వద్దకు రావాలి. ఇందుకోసం మూడు బహుమతులు పెట్టారు. బ్రహ్మయ్య, శ్రీనుల బృందం మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి రూ.10,000 నాగబాబు, రాములు గెలుచుకున్నారు. హరిబాబు, కొండలరావులకు రూ.5,000 తృతీయ బహుమతి లభించింది.

ఇక సంక్రంతి సందర్భంగా కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల హైలెట్ అని చెప్పవచ్చు. 500 మీటర్ల పరుగు పందెంలో జంగారెడ్డిగూడెం జట్టుకు చెందిన ఎర్రా కాల్వ మొదటి స్థానాన్ని గెలుచుకోగా, ఏలూరు జట్టుకు చెందిన బండారు బలగం 1,000 మీటర్ల పరుగు పందెంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పోటీలో మొత్తం 22 జట్లు పాల్గొన్నాయి.

500 మీటర్ల ఈవెంట్‌లో కర్నూలు జట్టు రెండో స్థానంలో, పల్నాడు జట్టు మూడో స్థానంలో నిలిచింది. 1,000 మీటర్ల రేసులో పల్నాడు రెండో స్థానంలో, కోనసీమ మూడో స్థానంలో నిలిచింది. 500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.70,000, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50,000, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.30,000 బహుమతిగా ఇచ్చారు. 1,000 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.2 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.1 లక్ష, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50,000 బహుమతిగా ఇచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More