కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. ఆల్‌ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ అయింది. ఒడిశా రాయగడలో ఆల్ట్రేషన్, ఫిట్‌నెస్ చేయించుకుంది. అయితే ఆల్ట్రేషన్‌లో సీటింగ్ పర్మిషన్ జారీ చేశారు రాయగడ అధికారులు. 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్‌గా మార్చింది కావేరి ట్రావెల్స్. బస్సులు నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేసింది.

ప్రమాదానికి గురైన బస్సు 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయింది. 2023లో ఎన్‌ఓసీతో డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్ మార్పు చేశారు. రిజిస్ట్రేషన్ మార్చి స్లీపర్ కోచ్‌గా అక్రమానికి తెరదీసింది కావేరి ట్రావెల్స్. ఈ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. ముత్తం రూ.23120 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించింది. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైనా చలాన్లు పడినాయి.
బస్సులో 39 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నపిల్లలు ఉన్నారని హోం మంత్రి అనిత చెప్పారు. మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నారన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు ఆరాంఘర్ చౌరస్తాలో ఎక్కారన్నారు. ఆరాంఘర్ చౌరస్తాలో ఎక్కిన ఇద్దరిలో ఒకరు దిగిపోయారన్నారు. ఇద్దరు డ్రైవర్లు సహా 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు. 23 మంది పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు డ్రైవర్లు బయటపడ్డారన్నారు.
‘స్వల్పగాయాలతో ఆస్పత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు ఆకాష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 19 మంది చనిపోయారు. చనిపోయినవారిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారు. మృతుల్లో బాపట్ల జిల్లా వాసి ధాత్రి, కోనసీమ జిల్లా వాసి శ్రీనివాస్‌రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. చనిపోయినవారిలో ఆరుగురు తెలంగాణ వాసులు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు తమిళనాడు, ఇద్దరు కర్ణాటక వాసులు, ఒకరు ఒడిశా, ఒకరు బిహార్ వాసి ఉన్నారు. మరో మృతదేహాన్ని గుర్తుపట్టాల్సి ఉంది.’ అని హోంమంత్రి అనిత అన్నారు.
బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని హోంమంత్రి అనిత అన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందన్నారు. కర్నూలు జిల్లా బైకర్ శివశంకర్ (24) చనిపోయాడని వెల్లడించారు. ప్రమాద ఘటనపై మొత్తం 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. డీఎన్ఏ పరీక్షల నిర్వహణకు 10 బృందాలు ఏర్పాటు అయ్యాయని చెప్పారు. ప్రమాద కారణాల అన్వేషణకు మరో 4 బృందాలు ఏర్పాటు చేసిట్టుగా వెల్లడించారు. రసాయన విశ్లేషణ కోసం మరో 2 బృందాలు ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు.
{{/usCountry}}బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని హోంమంత్రి అనిత అన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందన్నారు. కర్నూలు జిల్లా బైకర్ శివశంకర్ (24) చనిపోయాడని వెల్లడించారు. ప్రమాద ఘటనపై మొత్తం 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. డీఎన్ఏ పరీక్షల నిర్వహణకు 10 బృందాలు ఏర్పాటు అయ్యాయని చెప్పారు. ప్రమాద కారణాల అన్వేషణకు మరో 4 బృందాలు ఏర్పాటు చేసిట్టుగా వెల్లడించారు. రసాయన విశ్లేషణ కోసం మరో 2 బృందాలు ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు.
{{/usCountry}}