పర్మిషనేమో సీటింగ్ కోసం.. మార్చింది మాత్రం స్లీపర్‌గా.. కర్నూలు బస్సు ప్రమాదంలో వెలుగులోకి కీలక విషయాలు!

 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు సీటింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంది. కానీ దాన్ని స్లీపర్‌గా మార్చింది.

Published on: Oct 24, 2025, 17:37:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. ఆల్‌ఇండియా పర్మిట్‌ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు డామన్‌ డయ్యూలో రిజిస్ట్రేషన్‌ అయింది. ఒడిశా రాయగడలో ఆల్ట్రేషన్, ఫిట్‌నెస్ చేయించుకుంది. అయితే ఆల్ట్రేషన్‌లో సీటింగ్‌ పర్మిషన్‌ జారీ చేశారు రాయగడ అధికారులు. 43 సీట్ల సీటింగ్‌ పర్మిషన్‌ తీసుకొని స్లీపర్‌గా మార్చింది కావేరి ట్రావెల్స్‌. బస్సులు నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేసింది.

కర్నూలు బస్సు ప్రమాదం
కర్నూలు బస్సు ప్రమాదం

ప్రమాదానికి గురైన బస్సు 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ అయింది. 2023లో ఎన్‌ఓసీతో డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్‌ మార్పు చేశారు. రిజిస్ట్రేషన్‌ మార్చి స్లీపర్‌ కోచ్‌గా అక్రమానికి తెరదీసింది కావేరి ట్రావెల్స్‌. ఈ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. ముత్తం రూ.23120 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించింది. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైనా చలాన్లు పడినాయి.

బస్సులో 39 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నపిల్లలు ఉన్నారని హోం మంత్రి అనిత చెప్పారు. మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నారన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు ఆరాంఘర్‌ చౌరస్తాలో ఎక్కారన్నారు. ఆరాంఘర్‌ చౌరస్తాలో ఎక్కిన ఇద్దరిలో ఒకరు దిగిపోయారన్నారు. ఇద్దరు డ్రైవర్లు సహా 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు. 23 మంది పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు డ్రైవర్లు బయటపడ్డారన్నారు.

‘స్వల్పగాయాలతో ఆస్పత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు ఆకాష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 19 మంది చనిపోయారు. చనిపోయినవారిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌ వాసులు ఉన్నారు. మృతుల్లో బాపట్ల జిల్లా వాసి ధాత్రి, కోనసీమ జిల్లా వాసి శ్రీనివాస్‌రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. చనిపోయినవారిలో ఆరుగురు తెలంగాణ వాసులు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు తమిళనాడు, ఇద్దరు కర్ణాటక వాసులు, ఒకరు ఒడిశా, ఒకరు బిహార్‌ వాసి ఉన్నారు. మరో మృతదేహాన్ని గుర్తుపట్టాల్సి ఉంది.’ అని హోంమంత్రి అనిత అన్నారు.

బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని హోంమంత్రి అనిత అన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందన్నారు. కర్నూలు జిల్లా బైకర్‌ శివశంకర్‌ (24) చనిపోయాడని వెల్లడించారు. ప్రమాద ఘటనపై మొత్తం 16 ఫోరెన్సిక్‌ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. డీఎన్‌ఏ పరీక్షల నిర్వహణకు 10 బృందాలు ఏర్పాటు అయ్యాయని చెప్పారు. ప్రమాద కారణాల అన్వేషణకు మరో 4 బృందాలు ఏర్పాటు చేసిట్టుగా వెల్లడించారు. రసాయన విశ్లేషణ కోసం మరో 2 బృందాలు ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More