రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది.
ప్రతీ ఒప్పందం గ్రౌండ్ కావాలి

రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతీ ప్రతిపాదనా ఒప్పందంగా మారాలని.. కుదుర్చుకున్న ప్రతీ ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక పెట్టుబడి, పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి వరకూ నిర్దిష్టమైన కాలపరిమితిలో జరిగేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్క రోజు కూడా జాప్యం జరగకూడదు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనుమతుల జారీ విషయంలో ఏపీ బ్రాండ్ సృష్టించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ఎలా భిన్నమో ఏపీలో అనుమతులు ఎంత సులభతరమన్నది చాటి చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చే స్థానాల్లో నియమించాలని సూచించారు.
వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్
సచివాలయంలో జరిగిన 17వ ఎస్ఐపీబి సమావేశంలో 25 ప్రాజెక్టులకు చెందిన రూ.2,01,023 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..'పెట్టుబడుల విషయంలో భారీ పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో.. ఎంఎస్ఎంఈలకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యుర్ విషయంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయి. అన్ని పారిశ్రామిక ప్రాంతాలకు గ్యాస్ పైప్ లైన్ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఫుడ్ ప్రాసెసింగ్‌లో రంగంలో రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడాలి.' అని చంద్రబాబు అన్నారు.
మన రాష్ట్రంలో ఉద్యాన, వాణిజ్య పంట ఉత్పత్తులకు విలువ జోడింపు జరగాలని చంద్రబాబు సూచించారు. ఆయిల్ పాం, మామిడి, కొబ్బరి, కోకో సహా పలు పంటలకు వ్యాల్యూ అడిషన్ ఇస్తే రైతులకు ఎంతో మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్, మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు, సుభాష్, వివిధ శాఖల అధికారులు, వర్చువల్గా మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
ఆమోదం పొందిన ప్రతిపాదనల వివరాలు
- రిలయన్స్ ఇండస్ట్రీస్ - శ్రీసత్యసాయి జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు రూ.51,300 కోట్ల పెట్టుబడులు, 20 వేల మందికి ఉద్యోగాలు
- క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రీడ్ త్రీ లిమిటెడ్, నంద్యాలలో రూ.155 కోట్ల పెట్టుబడులు, 40 మందికి ఉద్యోగాలు
- క్లీన్ ఎనర్జీ హైబ్రీడ్ ట్వెల్వ్ లిమిటెడ్ అనంతపురం జిల్లా రూ.779 కోట్ల పెట్టుబడులు, 125 మందికి ఉద్యోగాలు
- క్లీన్ ఎనర్జీ హైబ్రీడ్ థర్టీన్ లిమిటెడ్ అనంతపురం జిల్లా రూ.779 కోట్ల పెట్టుబడులు 125 మందికి ఉద్యోగాలు
- అదానీ హైడ్రో ఎనర్జీ ఎలెవెన్ కడప జిల్లాలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రూ. 12,297 కోట్ల పెట్టుబడులు, 3375 మందికి ఉద్యోగాలు
- యమాన్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ రూ.9398 కోట్ల పెట్టుబడులు, 5820 మందికి ఉద్యోగాలు
- అమృత శ్రీ బయో సీఎన్జీ లిమిటెడ్ విజయనగరం రూ.89 కోట్ల పెట్టుబడులు, 402 మందికి ఉద్యోగాలు
- బాలాజీ బయోఎనర్జీ ఆర్గానిక్స్, నెల్లూరు జిల్లా రూ.59 కోట్ల పెట్టుబడులు, 335 మందికి ఉద్యోగాలు
- హెచ్ పీసీఎల్ రెన్యూబుల్ గ్రీన్ ఎనర్జీ, ఏలూరు జిల్లా రూ.100 కోట్ల పెట్టుబడులు, 150 మందికి ఉద్యోగాలు
- ఎనర్జియా బయో ఫ్యూయల్స్ తిరుపతి జిల్లాలో సీబీజీ ప్లాంట్ రూ.59 కోట్ల పెట్టుబడులు, 335 మందికి ఉద్యోగాలు
- విభా బయో ఫ్యూయల్స్ తూర్పుగోదావరి జిల్లా రూ.67 కోట్ల పెట్టుబడులు, 110 మందికి ఉద్యోగాలు
- ఐఓసీ జీపీఎస్ రెన్యువబుల్స్ ఎన్టీఆర్ జిల్లాలో సీబీజీ ప్లాంట్ రూ.120 కోట్లు పెట్టుబడులు, 200 మందికి ఉద్యోగాలు
- డెల్టా బయోగ్యాస్ పలనాడు జిల్లా రూ. 100 కోట్లు పెట్టుబడులు, 750 మందికి ఉద్యోగాలు
- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విశాఖలో డేటాసెంటర్ ఏర్పాటు రూ.1,08,010 కోట్ల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు
- క్యారియర్ ఎయిర్ కండిషనింగ్, తిరుపతి జిల్లాలో బల్క్ చిల్లర్స్ తయారీ రూ.863 కోట్ల పెట్టుబడులు, 721 మందికి ఉద్యోగాలు.
- ఎన్ఎస్టీఎల్ డీఆర్డీఓ, అమరావతి క్వాంటం వ్యాలీ రూ.22.5 కోట్ల పెట్టుబడి, 20 మందికి ఉద్యోగాలు
- స్నేహా ఫార్మ్స్ లిమిటెడ్ అనంతపురం, అన్నమయ్య జిల్లాలు, రూ,277.94 కోట్ల పెట్టుబడులు, 435 మందికి ఉద్యోగాలు
- గ్రైడోన్ ఎనర్జీ లిమిటెడ్, కర్నూలు జిల్లా, రూ.3149 కోట్ల పెట్టుబడులు, 320 ఉద్యోగాలు
- అపోలో టైర్స్ , తిరుపతి జిల్లా, శ్రీసిటీ రూ,6100 కోట్లు పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు
- ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్, ఫ్రాగ్రెన్సెస్ ఇఫ్కో సెజ్ నెల్లూరు, రూ.3153 కోట్ల పెట్టుబడులు, 172 మందికి ఉద్యోగాలు
- రాయల్ ఎన్ ఫీల్డ్, తిరుపతి జిల్లా, రూ.2508 కోట్ల పెట్టుబడులు, 3 వేల మందికి ఉద్యోగాలు
- చెట్టినాడ్ సిమెంట్స్ , పల్నాడు జిల్లా, రూ.1340 కోట్లు పెట్టుబడులు, 360 మందికి ఉద్యోగాలు
- ఏఏకె సౌత్ ఈస్ట్ ఇండియా కాకినాడ జిల్లా, రూ.171.52 కోట్ల పెట్టుబడులు, 102 మందికి ఉద్యోగాలు
- ఐటీసీ లిమిటెడ్, గుంటూరు జిల్లా రూ.51.65 కోట్ల పెట్టుబడులు, 50 మందికి ఉద్యోగాలు
- హ్యాంగ్యో ఐస్ క్రీమ్స్ తిరుపతి జిల్లా రూ.74.49 కోట్ల పెట్టుబడులు, 110 మందికి ఉద్యోగాలు