రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు.. నవంబర్ 14 నుంచి కొత్త టైమింగ్స్
దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు జరిగాయి. నవంబర్ 14 నుంచి కొత్త సమయాలు అమలులోకి వస్తాయి.
విశాఖపట్నం పరిధిలోని దువ్వాడ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణించే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయ వేళలను మారుస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నూతన వేళలు 2026 నవంబర్ 14వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి.

చర్లపల్లి - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం. 18528)
పాత సమయం ప్రకారం.. ఇదివరకు ఈ రైలు ఉదయం 04:35 గంటలకు వచ్చి, 04:37 గంటలకు బయలుదేరేది. కొత్తగా దువ్వాడ స్టేషన్‌కు ఉదయం 04:23 గంటలకు చేరుకుని, 04:25 గంటలకు బయలుదేరుతుంది.
పోడనూర్ - ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం. 16619)
పాత టైమింగ్స్ ప్రకారం.. గతంలో ఈ రైలు ఉదయం 04:43 గంటలకు వచ్చి, 04:45 గంటలకు బయలుదేరేది. కొత్త సమయం ప్రకారం.. దువ్వాడ స్టేషన్‌కు ఉదయం 04:38 గంటలకు చేరుకుని, 04:40 గంటలకు బయలుదేరుతుంది.
ప్రయాణికులకు రైల్వే శాఖ సూచనలు
దువ్వాడ స్టేషన్ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ఈ సమయ మార్పులను గమనించి, తమ ప్రయాణ ప్రణాళికలను దానికి అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు. రైలు ప్రయాణ సమయాలలో చివరి నిమిషంలో ఎటువంటి ఇబ్బందులు లేదా అయోమయం కలగకుండా ఉండేందుకు ప్రయాణికులు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) యాప్ ద్వారా గానీ లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 కి కాల్ చేసి తాజా సమయాలను సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు రద్దు
విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలును (రైలు సంఖ్య 04159/04160) రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నేరుగా రాకపోకలు సాగించే కీలక రైలు సర్వీసు కావడంతో ఈ నిర్ణయం నిత్య ప్రయాణికులు, యాత్రికులు, విద్యార్థుల ప్రయాణ ప్రణాళికలను దెబ్బతీసింది. సుమారు 1,350 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణించే ఈ రైలు అందుబాటులో లేకపోవడంతో, ప్రయాణికులు విజయవాడ, హౌరా లేదా బిలాస్‌పూర్ వంటి రద్దీగా ఉండే జంక్షన్ల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. సాధారణంగా 27 గంటల్లో పూర్తయ్యే ప్రయాణ సమయం, ఈ ప్రత్యామ్నాయ మార్గాల వల్ల మరింత ఆలస్యమవుతోంది.
పండుగల సీజన్ సమీపిస్తుండటంతో రైల్వే అధికారులను ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రైలును పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ సమస్య తీవ్రతపై స్పందించిన దక్షిణ కోస్తా రైల్వే ఉన్నతాధికారులు, ప్రజా ఫిర్యాదులను రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు నగరాల మధ్య త్వరలోనే క్రమబద్ధమైన రైలు సర్వీసును పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రయాగ్‌రాజ్-విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ వారపు ప్రత్యేక రైలు సర్వీసులను రద్దు చేయడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహణాపరమైన కారణాల వల్ల ఈ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సర్వీసు అనేక ముఖ్యమైన స్టేషన్లను కలుపుతూ సుదూర మార్గం ద్వారా విశాఖపట్నాన్ని ప్రయాగ్‌రాజ్‌తో కలుపుతుంది. ఈ రద్దుల కాలంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రైళ్లు, ప్రయాణ మార్గాలను వెతుక్కోవాల్సి రావచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


