OTT Thriller: ఓటీటీలోకి నయా క్రైమ్ థ్రిల్లర్- రైల్వే టికెట్ల స్కామ్ కథ, భార్యాభర్తలుగా శత్రువులు- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Railway Ticket Scam Waiting Hai OTT Streaming: ఓటీటీలోకి న్యూ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానుంది. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ చేసినప్పుడు వచ్చే వెయిటింగ్ లిస్ట్‌లో ఎలాంటి స్కామ్ జరుగుతుందనే కథగా తెరకెక్కిన వెయిటింగ్ హై ఓటీటీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. వెయిటింగ్ హై ఓటీటీ రిలీజ్ ఎక్కడో చూద్దాం.
Railway Ticket Scam Waiting Hai OTT Release: ఓటీటీ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన మీర్జాపూర్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్‌లో మున్నా భయ్యాగా అలరించిన దివ్యేందు శర్మ, గుడ్డూ పండిట్ చెల్లెలు డింపీ పాత్రలో మెప్పించిన హర్షిత గౌర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో జంటగా
ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎమ్‌ఎక్స్ ప్లేయర్ సంయుక్తంగా తీసుకువస్తున్న 'వెయిటింగ్ హై' అనే కామెడీ స్కామ్ డ్రామాలో వీరిద్దరూ జంటగా అంటే భార్యాభర్తులుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన వెయింటింగ్ హై టీజర్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేశారు.
రైల్వే 'వెయిటింగ్ లిస్ట్' స్కామ్ కాన్సెప్ట్!
మనదేశంలో సామాన్య ప్రయాణికుడికి పండుగలు, సెలవుల సమయంలో రైలు టికెట్ దొరకడం పెద్ద సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఎంత త్వరగా ప్రయత్నించినా 'వెయిటింగ్ లిస్ట్' మాత్రమే దర్శనమిస్తుంటుంది. సరిగ్గా ఈ నిత్య సమస్యనే కథాంశంగా ఎంచుకుని 'వెయిటింగ్ హై' కథను మలిచారు దర్శకనిర్మాతలు.
రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో దివ్యేందు
ఈ సిరీస్‌లో సుగమ్ మిశ్రా అనే రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో దివ్యేందు కనిపించనున్నారు. సామాన్యులకు టికెట్లు దొరక్కపోతుంటే, కొంతమంది ఏజెంట్లు మాత్రం చాలా సులువుగా టికెట్లను ఎలా కన్ఫర్మ్ చేయిస్తున్నారనే రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఈ కథ సాగుతుంది.
స్కామ్ వెనుక తెలివైన హ్యాకర్
ఈ స్కామ్ వెనుక ఉన్న ఒక తెలివైన హ్యాకర్ పాత్రలో భువన్ అరోరా కనిపించనున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు, హ్యాకర్‌కు మధ్య సాగే వినోదాత్మక మైండ్ గేమ్‌తో వెయింటింగ్ హై ఓటీటీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది.
మరోసారి ఒకే తెరపై 'మిర్జాపూర్' జోడీ!
మీర్జాపూర్ సిరీస్‌లో ఒకరికొకరు శత్రువులుగా కనిపించిన దివ్యేందు, హర్షిత గౌర్‌లు ఇందులో భార్యాభర్తలుగా నటిస్తుండటం విశేషం. మీర్జాపూర్ అభిమానులకు వీరిద్దరి కొత్త లుక్ సరికొత్త వినోదాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. దివ్యేందుతో తనకున్న సుదీర్ఘ ప్రయాణం గురించి హర్షిత గౌర్ స్పందిస్తూ..
మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపిస్తుంది
"దివ్యేందుతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మేము దాదాపు పదేళ్లుగా ఒకరికొకరు తెలుసు. కలిసి పనిచేస్తున్నాం. అందుకే మా మధ్య మంచి అవగాహన, సులువుగా పనిచేసే చనువు ఉంటాయి. 'వెయిటింగ్ హై' సిరీస్‌లో ఒక విభిన్నమైన బంధంతో ముందుకు వస్తున్నాం. స్క్రీన్ మీద మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపిస్తుంది" అని పేర్కొన్నారు.
భారీ తారాగణంతో క్రైమ్ కామెడీ!
జాతీయ అవార్డు గ్రహీత సమీర్ విద్వాన్స్ ఈ వెయిటింగ్ హై సిరీస్‌కు దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్, జార్ పిక్చర్స్ నిర్మించాయి. కుముద్ మిశ్రా, విజయ్ మౌర్య, సృష్టి తారే, సునీతా రాజ్‌వార్ తదితర సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు.
వెయిటింగ్ హై ఓటీటీ స్ట్రీమింగ్
ఈ రైల్వే స్కామ్ డ్రామా త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఎమ్‌ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో కూడా వెయింటింగ్ హై సిరీస్ ఉచితంగా ప్రసారం కానుంది. అయితే, ఇప్పటికైతే వెయిటింగ్ హై ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


