విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి, బహిరంగ సభకు వచ్చే ప్రజల రవాణా సౌకర్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,000 బస్సులను భోగాపురం తరలించనున్నారు.

ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి 160 ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా భోగాపురం కేటాయించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వి. నీలిమ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికారంగా జూలై 31, 2026 నుండి ఆగస్టు 1, 2026 వరకు (రెండు రోజుల పాటు) ఎన్టీఆర్ జిల్లా పరిధిలో సాధారణ ప్రయాణికులకు కొన్ని బస్సులు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ తాత్కాలిక అసౌకర్యాన్ని అర్థం చేసుకుని, తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు. అవసరమైన మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి మణిహారంగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. దాదాపు రూ.4,727 కోట్ల అంచనా వ్యయంతో జీఎమ్‌ఆర్ గ్రూప్ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ నమూనాలో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది.
మొదటి విడతలో ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భవిష్యత్తులో దీనిని 4 కోట్లకు విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. పెద్ద రకం విమానాలు సునాయాసంగా ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవైన రన్ వేను ఏర్పాటు చేశారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర పరిధిలో పరిశ్రమలు, టూరిజం, ఐటీ మరియు కార్గో రవాణా రంగాలకు భారీ ఊతం లభించనుంది.
భోగాపురం భారతదేశంలో అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటి. ఇది నిర్ణీత గడువు కంటే దాదాపు ఐదు నెలల ముందుగానే కేవలం 31 నెలల్లోనే పూర్తయింది. ఈ విమానాశ్రయం ఇప్పటికే అవసరమైన అన్ని భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులతో పాటు, డీజీసీఏ ఏరోడ్రోమ్ లైసెన్సును కూడా పొందింది.
{{/usCountry}}భోగాపురం భారతదేశంలో అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటి. ఇది నిర్ణీత గడువు కంటే దాదాపు ఐదు నెలల ముందుగానే కేవలం 31 నెలల్లోనే పూర్తయింది. ఈ విమానాశ్రయం ఇప్పటికే అవసరమైన అన్ని భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులతో పాటు, డీజీసీఏ ఏరోడ్రోమ్ లైసెన్సును కూడా పొందింది.
{{/usCountry}}