Hero Injury: టాలీవుడ్‌లో వరుస గాయాల కలకలం.. చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు.. స్టార్ హీరోల ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన!
Hero Injury: టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా షూటింగ్‌లలో గాయపడటం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వరకు హీరోల వరుస గాయాలు హాట్ టాపిక్ గా మారాయి. 2026లో గాయాలపాలైన స్టార్ హీరోల వివరాలపై ఓ లుక్కేయండి.
Hero Injury: తెలుగు చిత్రసీమ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ స్థాయి విజయం వెనుక టాలీవుడ్ స్టార్ హీరోలు పడుతున్న శ్రమ, తీసుకుంటున్న శారీరక రిస్క్ సాధారణమైనది కాదు. ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు వరుసగా ఏదో ఒక గాయం బారిన పడటం, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి రావడం అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మెగాస్టార్ నుంచి యంగ్ టైగర్ వరకు
టాలీవుడ్ దిగ్గజ హీరోల నుంచి యంగ్ స్టార్ల వరకు ప్రతీ ఒక్కరినీ ఈ గాయాల సమస్య వెంటాడుతోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' సమయం నుంచే మెగాస్టార్ చిరంజీవి భుజం నొప్పితో బాధపడుతూ ప్రత్యేక శస్త్రచికిత్స, ఫిజియోథెరపీ చికిత్స తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం ఇటీవల తీవ్రమైన భుజం గాయానికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.
తాజాగా ఎన్‌బీకే111 మూవీ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. ఆయనకు మోకాలి సర్జరీ జరిగింది.
యంగ్ హీరోలు కూడా
మరోవైపు యంగ్ జనరేషన్‌లో వరుణ్ తేజ్ మోకాలి ఫ్రాక్చర్ కారణంగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ సమయంలో తీవ్రమైన మణికట్టు గాయంతో బాధపడి, ఇటీవల కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
ఇప్పుడేమో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హై-యాక్షన్ షెడ్యూల్స్ మధ్య భుజం గాయానికి గురికావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రూ.వందల కోట్ల రిస్క్
గతంలో డూప్ లతో లేదా గ్రాఫిక్స్‌తో మేనేజ్ చేసే యాక్షన్ సీక్వెన్సులను, ఇప్పుడు కొంతమంది హీరోలే స్వయంగా రియలిస్టిక్ ఫీల్ కోసం బాడీ డబుల్ లేకుండా చేస్తున్నారు. దీనికి తోడు ప్రతి సినిమా బడ్జెట్ రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్లకు చేరతుంది.
దీంతో షూటింగ్ వాయిదా పడితే నిర్మాతలు నష్టపోతారనే ఉద్దేశంతో హీరోలు గాయాలను భరిస్తూనే షూటింగ్‌లు, ప్రమోషన్లు పూర్తి చేస్తున్నారు. రామ్ చరణ్ తన మణికట్టు సర్జరీని 'పెద్ది' ప్రమోషన్ల కోసం నెలల తరబడి వాయిదా వేసుకోవడం ఇందుకు తాజా ఉదాహరణ.
ఫ్యాన్స్ టెన్షన్
ట్రేడ్ అండ్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషణ ప్రకారం, స్టార్ హీరోల హెల్త్ అప్‌డేట్స్ కేవలం అభిమానుల భావోద్వేగాలకే కాక ఇండస్ట్రీ బిజినెస్‌తో కూడా ముడిపడి ఉన్నాయి. ఒక స్టార్ హీరో గాయపడితే రూ.వందల కోట్ల ప్రాజెక్టులు నిలిచిపోతాయి. దీంతో ఇన్సూరెన్స్ విధానాలు, సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను టాలీవుడ్ సెట్స్‌లో మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
మరోవైపు తమ అభిమాన కథానాయకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


