Pawan Kalyan: అబ్బాయ్ ఆరోగ్యంపై బాబాయ్ ఆందోళన.. వరుణ్ తేజ్ త్వరగా కోలుకుని కెమెరా ముందుకు రావాలన్న పవన్ కల్యాణ్
Pawan Kalyan: అన్న కొడుకు వరుణ్ తేజ్ ఆరోగ్యంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. మోకాలికి సర్జీర చేయించుకున్న వరుణ్ త్వరగా కోలుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆశించారు.
Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోకాలికి సర్జరీ అయిన సంగతి తెలిసిందే. బరి సినిమా షూటింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ మోకాలికి గాయమైంది. దీంతో సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆపరేషన్ చేయించుకున్న వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆశించారు. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

వరుణ్ త్వరగా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిన్నన్న నాగబాబు కొడుకే వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ కు సర్జరీ జరిగిందని తెలిసి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘యువ కథానాయకుడు వరుణ్ తేజ్ ‘బరి’ సనిమా షూటింగ్ కోసం చేస్తున్న ప్రాక్టీసులో గాయపడ్డారని తెలిసింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. వైద్యులు, ఫిజియోల సూచనలు పాటిస్తూ కోలుకొని, కెమెరా ముందుకు రావాలి’’ అని ఓ ప్రకటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వరుణ్ ఇంజూరీ
వరుణ్ తేజ్ ప్రస్తుతం బరి సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రానికి అతని చెల్లి నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్. ఈ మూవీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో వాలీబాల్ ప్లేయర్ గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ వాలీబాల్ ప్రాక్టీస్ లో భాగంగానే వరుణ్ కు గాయమైంది. అతని సర్జరీ జరిగిందని సోషల్ మీడియా ద్వారా నిహారిక అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
పవన్ గెస్ట్
ఇటీవల జరిగిన బరి మూవీ షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆయనే క్లాప్ కొట్టారు. కాసేపు మూవీ టీమ్ తో టైమ్ స్పెండ్ చేసి వెళ్లిపోయారు. బాబాయ్ రావడంతో కిక్ వచ్చిందని అప్పుడు వరుణ్ తేజ్ తెలిపాడు.
కొరియన్ కనకరాజు
మరోవైపు వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో నుంచి రీసెంట్ గా ఓ సాంగ్ రిలీజైంది. ఈ మూవీని డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
ప్రొడ్యూసర్ గా
ఇక మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్ గా సత్తాచాటుతోంది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ప్రొడ్యూసర్ గా ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న నిహారిక.. రీసెంట్ గా ‘రాకాస’తో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు అన్నయ్య వరుణ్ తేజ్ తో బరి నిర్మిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


