Varun Tej: మూడు నెలల నుంచి బయటకు రాలేదు-ఇప్పుడు గుండె నిండిపోయింది-చేతి కర్రతోనే వరుణ్ తేజ్-హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు

Varun Tej: సినిమాపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ఉన్న ప్రేమకు నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా కొరియన్ కనకరాజు మూవీ నుంచి సాంగ్ లాంఛ్ కు వరుణ్ తేజ్ చేతి కర్ర సాయంతో రావడమే ఇందుకు కారణం. డెడికేషన్ కు హ్యాట్సాఫ్ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Published on: Jul 19, 2026, 21:50:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Varun Tej: కొరియన్ కనకరాజు అంటూ హారర్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు. ఈ మూవీ నుంచి ‘రాసగుమ్మడి’ సాంగ్ ను ఇవాళ (జూలై 19) లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

మూడు నెలల నుంచి బయటకు రాలేదు-ఇప్పుడు గుండె నిండిపోయింది-చేతి కర్రతోనే వరుణ్ తేజ్-హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
మూడు నెలల నుంచి బయటకు రాలేదు-ఇప్పుడు గుండె నిండిపోయింది-చేతి కర్రతోనే వరుణ్ తేజ్-హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు

చేతి కర్రతోనే వరుణ్ తేజ్

కొరియన్ కనకరాజు సినిమాలోని ‘రాసగుమ్మడి’ సాంగ్ ను మూవీ టీమ్ ఆదివారం రిలీజ్ చేసింది. దీని కోసం అనంతపురంలోని వీ మెగా థియేటర్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్ చేతి కర్ర సాయంతోనే వచ్చాడు. స్టేజీపై అలాగే నిలబడ్డాడు. వరుణ్ తేజ్ కాలుకు మూడు నెలల క్రితం సర్జరీ అయిన సంగతి తెలిసిందే.

పెదనాన్నలా డ్యాన్స్

సాంగ్ లాంఛ్ ఈవెంట్ సందర్బంగా వరుణ్ తేజ్ కామెంట్లు వైరల్ గా మారాయి. ‘‘అనంతపురంలో షూటింగ్ చేశాం కాబట్టి, సెంటిమెంట్ గా ఫస్ట్ ఈవెంట్ ఇక్కడే పెట్టాలనుకున్నాం. మీ అందరి ముందు పాటను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పెదనాన్న (చిరంజీవి)ను మైండ్ లో పెట్టుకుని, ఆయనలా కొంచమైనా డ్యాన్స్ చేయాలని ట్రై చేశా. ఈ సాంగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశా. కాలు బాలేదు కాబట్టి స్టెప్ వేయలేకపోతున్నా’’ అని వరుణ్ అన్నాడు.

గుండె నిండిపోయిందంటూ

‘‘ఆగస్టు 7న మా సినిమా మీ ముందుకు వస్తుంది. మీరు ఆదరిస్తారని నమ్ముతున్నా. ఒంట్లో బాలేక మూడు నెలల నుంచి బయటకు రాలేదు. ఇంతమంది జనాలను చూసి గుండె నిండిపోయింది’’ అని వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యాడు. ఫ్యాన్స్ కోరిక మేరకు.. ‘‘కెలికేసినావ్ అప్పా సీను. కదిరి నరసింహసామి సాచ్చి సెప్తన్నా. ఈ పూట నీ సరీర్లో ఏదో ఒక పార్ట్ తేగి పడుద్ది.. సూసుకో’’ అంటూ వరుణ్ డైలాగ్ పేల్చాడు.

మోకాలి సర్జరీ

వరుణ్ తేజ్ తన చెల్లి నిహారిక ప్రొడక్షన్ లో ‘బరి’ అనే సినిమాకు సైన్ చేశాడు. ఈ మూవీ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ తేజ్ కు గాయమైంది. ఏప్రిల్ లో మోకాలికి సర్జరీ జరిగింది. ఈ సర్జరీ నుంచి వరుణ్ తేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ కొరియన్ కనకరాజు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చేతికర్రతోనే ప్రమోషన్లకు వచ్చాడు వరుణ్ తేజ్.

హ్యాట్సాఫ్ బ్రో

కొరియన్ కనకరాజు సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ చేతి కర్రతో ఇబ్బంది పడుతూనే మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘నీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ బ్రో’’ అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కొరియన్ కనకరాజు మూవీ ఆగస్టు 7న రిలీజ్ కానుంది. ఇందులో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More