Varun Tej: కోలుకుంటున్న మెగా హీరో.. బలంగా తిరిగొస్తానంటూ వరుణ్ తేజ్ పోస్ట్

Varun Tej: మోకాలి సర్జరీ నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ కోలుకుంటున్నాడు. తన హెల్త్ అప్ డేట్ గురించి అతను సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. 

Published on: Apr 18, 2026, 21:52:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ తన మోకాలు సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు. సినిమా షూటింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ తేజ్ మోకాలికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన హెల్త్ అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా వరుణ్ పంచుకున్నాడు.

వరుణ్ తేజ్ (Instagram)
వరుణ్ తేజ్ (Instagram)

వరుణ్ తేజ్ పోస్ట్

వరుణ్ తేజ్ స్వయంగా తన ఎక్స్ ఖాతా ద్వారా హెల్త్ అప్ డేట్ ఇచ్చాడు. "నా ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మెసేజ్‌లు చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆపరేషన్ బాగా జరిగింది. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టా. త్వరలోనే మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో, మరింత బలంగా మీ ముందుకు వస్తా" అని వరుణ్ రాసుకొచ్చాడు.

గాయం గురించి నిహారిక

వరుణ్ తేజ్ గాయం గురించి అతని సోదరి నిహారిక కొణిదెల ఫస్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. "నా అన్నయ్య వరుణ్ తేజ్ 'బరి' సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’’ అని సోషల్ మీడియాలో నిహారిక పేర్కొంది.

అసలేం జరిగింది?

వరుణ్ తేజ్ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న 'బరి' సినిమా కోసం అతను కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు. వాలీబాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా, వరుణ్ మోకాలికి బలమైన గాయమైంది. పరీక్షించిన వైద్యులు మోకాలి ఎముక విరిగిందని (Knee Fracture) నిర్ధారించి, సర్జరీ చేశారు.

బరి గురించి

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బరి’. ఇది వాలీబాల్ గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి యధు వంశీ డైరెక్టర్. నిహారిక కొణిదెల ఈ మూవీని నిర్మిస్తోంది. అన్నయ్య హీరోగా ఆమె సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది.

వరుణ్ తేజ్ సినీ ప్రస్థానం

గత 12 ఏళ్లుగా డిఫరెంట్ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్. 2014లో 'ముకుంద' సినిమాతో వెండితెరకు పరిచయమైన అతను.. ఆ తర్వాత లోఫర్, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ వంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం బరి సినిమాతో పాటు కొరియన్ కనకరాజు అనే మరో సినిమాలోనూ వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. మరోవైపు నిహారిక ప్రొడ్యూసర్ గా రాణిస్తోంది. కమిటీ కుర్రోళ్లు, రాకాసతో ఆమె వరుసగా సూపర్ హిట్లు అందుకుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

  1. మెగా ఫ్యామిలీలో ఎవరికి గాయమైంది? ఎలా జరిగింది?

నటుడు వరుణ్ తేజ్ తన కొత్త సినిమా 'బరి' కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి గాయమైంది.

2. వరుణ్ తేజ్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

అతని మోకాలికి శస్త్రచికిత్స పూర్తయింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు.

3. వరుణ్ తేజ్ తదుపరి సినిమాలు ఏవి?

వరుణ్ ప్రస్తుతం ‘బరి’, 'కొరియన్ కనకరాజు' అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More