Chiranjeevi: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. గబ్బర్ సింగ్ రమేష్ కు చిరంజీవి సాయం.. అందరివాడు అన్నయ్య!

Chiranjeevi: చిరంజీవి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్నవాళ్లకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందే ఉంటానని నిరూపించుకున్నారు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన గబ్బర్ సింగ్ నటుడు రమేష్‌కు మెగాస్టార్ ఆర్థిక సాయం అందించారు. వైద్య చికిత్స గురించి ఆరా తీశారు. 

Published on: Jul 26, 2026, 14:02:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chiranjeevi: కష్టాల్లో ఉన్న సినీ కార్మికులకు, తోటి నటులకు ఆపద్బాంధవుడిగా నిలవడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న నటుడు రమేష్‌కు చిరంజీవి అండగా నిలిచారు.

మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. గబ్బర్ సింగ్ రమేష్ కు చిరంజీవి సాయం (x)
మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. గబ్బర్ సింగ్ రమేష్ కు చిరంజీవి సాయం (x)

గబ్బర్ సింగ్ నటుడు

గబ్బర్ సింగ్ సినిమాలో రౌడీ గ్యాంగ్ లో నటించి పేరు సంపాదించుకున్న నటుడు రమేష్. అతను ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రమేష్ అత్యవసర వైద్య ఖర్చుల కోసం మెగా కుటుంబం నుంచి భారీ ఆర్థిక సాయం లభించింది.

అపోలో వైద్యులతో చిరంజీవి

నటుడు రమేష్ హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసిన వెంటనే చిరంజీవి తక్షణమే స్పందించారు. అపోలో ఆసుపత్రి ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుబ్బా రెడ్డితో ఆయన మాట్లాడారు.

అత్యుత్తమ వైద్యం

రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, అతనికి అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని వైద్య బృందాన్ని చిరంజీవి కోరారు. రమేష్ త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో మళ్లీ రంగుల ప్రపంచంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. గబ్బర్ సింగ్ లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తో నటించిన రమేష్ ఆరోగ్యం పట్ల చిరంజీవి ఆరా తీయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

5 లక్షల ఆర్థిక సాయం

అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు మెగా సోదరులు ముందుకొచ్చారు. చిరంజీవి తన వంతుగా రూ.3 లక్షల చెక్కును రమేష్ భార్యకు అందించగా, మెగా బ్రదర్ నాగబాబు రూ.2 లక్షల సాయం ప్రకటించారు. దీంతో మెగా కుటుంబం నుంచి మొత్తం రూ 5 లక్షల అత్యవసర ఆర్థిక సాయం లభించింది.

ఈ కష్ట సమయంలో లభించిన ఆర్థిక, నైతిక ఆసరా రమేష్ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పొచ్చు. ఆ సాయం చేసిన మెగా ఫ్యామిలీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టాల్లో ఉన్న నటులకు చిరంజీవి ఎప్పుడూ అండగా ఉంటారని కొనియాడుతున్నారు. అందరివాడు అన్నయ్య అని పోస్టులు పెడుతున్నారు.

సాయంగా మెగాస్టార్

టాలీవుడ్‌లో కష్టాల్లో ఉన్న చిన్న నటులు, సాంకేతిక నిపుణుల కోసం చిరంజీవి గత కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక సాయం అందిస్తూనే ఉన్నారు. కరోనా కష్టకాలం నుంచి మొదలుకొని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) సభ్యుల వరకు, అత్యవసర వైద్య సాయం కావాల్సిన ప్రతిసారి ముందుండే చిరంజీవి వైఖరి మరోసారి పరిశ్రమ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది. రమేష్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, తోటి నటీనటులు కోరుకుంటున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More