...
...
Next Story

GST Scam : ఆంధ్రా, తెలంగాణలో రూ. 217 కోట్ల జీఎస్టీ స్కామ్.. 72 షెల్ కంపెనీలు

GST Scam : ఆంధ్రా, తెలంగాణలో భారీ జీఎస్టీ స్కామ్ బట్టబయలు అయింది. జీఎస్టీ పేరుతో పెద్ద ఎత్తున మోసానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Published on: Mar 27, 2026, 12:41:42 IST
By , Visakhapatnam
Prefer HTon Google
Advertisement

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 217 కోట్ల స్కామ్ బయపడింది. సుమారు రూ. 1,472 కోట్ల విలువైన ఇన్‌వాయిస్ లావాదేవీలకు పాల్పడిన ఒక భారీ నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) సిండికేట్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విశాఖపట్నం జోనల్ యూనిట్ వెలికితీసింది.

జీఎస్టీ స్కామ్
జీఎస్టీ స్కామ్

ఇద్దరు కీలక వ్యక్తులు సిద్దగోని ప్రభాకర్, రమావత్ నాగరాజు నాయక్‌లను అధికారులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న దంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డి ఈ నెట్‌వర్క్‌కు సూత్రధారిగా ఉన్నట్లు విచారణలో తేలింది.

డీజీజీఐ ప్రకారం, అసాధారణమైన జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, రుణాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. డేటా విశ్లేషణ, రిస్క్ ప్రొఫైలింగ్, క్షేత్రస్థాయి పరిశీలనను ఉపయోగించారు. నిజానికి వ్యాపార కార్యకలాపాలు లేకపోయినా.. భారీ స్థాయిలో ఇన్‌వాయిస్‌లను జారీ చేస్తూ, ఏటీసీ క్లెయిమ్‌లు చేస్తున్న అనేక సంస్థలను గుర్తించారు.

నకిలీ ఐటీసీని సృష్టించి, పంపిణీ చేయడం కోసమే షెల్ సంస్థలను ఏర్పాటు చేసిన ఒక సిండికేట్‌ను అధికారులు గుర్తించారు. అమాయక వ్యక్తుల ఆధార్, పాన్ వివరాలను యజమానులుగా చూపి.. 72 షెల్ కంపెనీల ద్వారా ఈ దందా చేశారు. ఈ నకిలీ కంపెనీలు ఎలాంటి వస్తువులూ సరఫరా చేయకుండానే.. కాగితాలపై రూ.1,472 కోట్ల విలువైన లావాదేవీలు సృష్టించారు.

సామాన్యుల ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి.. తప్పుడు పత్రాలతో ఫోర్జరీ రిజిస్ట్రేషన్లు చేసి నకిలీ సంస్థలను నడిపారు. ఈ కేసులో సిద్ధగోని ప్రభాకర్ టెక్నికల్ పనులు చూసేవాడు, నాగరాజు నాయక్‌ తప్పుడు పత్రాలను తయారుచేసేవారు. వీరిద్దరినీ అధికారులు అరెస్ట్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks