ఈసారి తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 25 నుంచి 30 శాతం అధికంగా భక్తులు
తిరుమలలో అక్టోబర్ 12వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వివిధ విభాగాల ఏర్పాట్లపై అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవోలు డాక్టర్ శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరిగిన తొమ్మిది రోజుల సాలకట్ల బ్రహ్మోత్సవాలను భక్తులకు అనుకూలంగా, ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శనం కల్పించేలా పటిష్టమైన ఏర్పాట్లతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఇందుకు అన్ని విభాగాలు, పోలీసు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం ప్రధాన కారణమని, ఇదే సమన్వయ స్ఫూర్తిని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ కొనసాగించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో వరుస సెలవులు, పెరటాసి మాసం నేపథ్యంలో గతంతో పోలిస్తే సుమారు 25 నుంచి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఈవో తెలిపారు. ఈ మేరకు పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని విభాగాలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించి, ఏ అంశాలు సక్రమంగా అమలయ్యాయి, భక్తులకు ఏ ఏర్పాట్లు మరింత అనుకూలంగా నిలిచాయి, ఎక్కడైనా చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నాయా, వాటిని ఎలా సరిదిద్దుకోవాలనే అంశాలపై చర్చించినట్లు ఈవో తెలిపారు. గుర్తించిన లోటుపాట్లను నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ లాజిస్టిక్స్, అన్నప్రసాదం, వైద్య ఆరోగ్యం, పారిశుధ్యం, రవాణా తదితర అన్ని విభాగాల్లో అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని, వాహన సేవలను వీక్షిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈవో సూచించారు.
భక్తులందరూ తిరుమలకు విచ్చేసి ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని, వాహన సేవల్లో పాల్గొని మంచి ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని టీటీడీ ఈవో కోరారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం, పారిశుధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య సేవలు, రవాణా, పుష్పాలంకరణలు, విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, టీటీడీ విజిలెన్స్, పోలీసుల భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. టీటీడీలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు, పోలీసు, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


