Tirumala Brahmotsavams : తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
Tirumala : తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల చేశారు. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 2026 సంవత్సర బుక్లెట్‌ను తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు కలిసి ఆవిష్కరించారు.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి నిర్వహించే వివిధ వాహన సేవలు, విశేష ఉత్సవాలు, ముఖ్య కార్యక్రమాల వివరాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ బుక్లెట్ రూపొందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరి, జేఈవోలు డా.ఎ.శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు టీటీడీ, తిరుపతి జిల్లా యంత్రాంగం, పోలీసు తదితర అన్ని శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ తదితర అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఇప్పటికే టీటీడీ అదనపు ఈవో తిరుపతిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో భక్తులు సౌకర్యవంతంగా స్వామివారి వాహనసేవలను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలు, ప్రజా రవాణా వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ, పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, టీటీడీ, పోలీసు, మున్సిపల్, రవాణా, ఆరోగ్య తదితర శాఖలు ఒకే బృందంగా పనిచేసేలా కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.
గత బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, అదనపు ఏర్పాట్లు చేపట్టామని, భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అదనపు ఈవో చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారంపై తక్షణమే స్పందించేలా ప్రత్యేక రెస్పాన్సివ్ టీమ్, అలాగే విపత్తు నిర్వహణ, అత్యవసర స్పందన బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో రానున్న బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమష్టిగా కృషి చేస్తాయని ఆయన వివరించారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భక్తుల కోసం పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి, తిరుమలలో రద్దీకి అనుగుణంగా భక్తులను నియంత్రించనున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్ల ద్వారా స్వామివారి వాహనసేవలను భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ, పోలీసు, రెవెన్యూ, జిల్లా యంత్రాంగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో పార్కింగ్ పరిమితుల దృష్ట్యా తిరుపతిలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించి, అక్కడి నుంచి భక్తుల రవాణాకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్, అలిపిరి, శ్రీవారిమెట్టు తదితర కీలక ప్రాంతాలను తిరుపతి కమాండ్ కంట్రోల్ ద్వారా కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. తిరుమలలో ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు సుమారు 3,000 కెమెరాల ద్వారా భక్తుల రద్దీ, భద్రతను పర్యవేక్షించనున్నట్లు వివరించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


