గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్‌లోని జనార్దనపురంలో నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలోని 24 జిల్లాల్లో మరో 266 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను వర్చువల్‌గా ఏకకాలంలో ప్రారంభించారు. వీటి నిర్మాణానికి సుమారు రూ.105 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల పరిధిలో ఈ భవనాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు.

రాబోయే 6 నెలల్లో మిగిలిన 4,400 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఇందులో ఈ ఏడాది చివరి నాటికి 2,700 కేంద్రాల నూతన భవనాలను సిద్ధం చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. తదుపరి ప్రారంభ కార్యక్రమo ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరుగుతుందని తెలిపారు. భవన నిర్మాణ పనులు పంచాయతీరాజ్ శాఖ ద్వారా కొనసాగుతున్నాయని చెప్పారు. గ్రామం నుంచి పట్టణానికి వెళ్లి వైద్యం పొందాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలనే గ్రామానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లో ఒకేసారి 267 నూతన ఆరోగ్య భవనాలను ప్రారంభించడం అరుదైన ఘట్టంగా నిలిచింది.
గత ప్రభుత్వ నిర్వాకంతో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలతోపాటు కొత్తగా చేపట్టిన నిర్మాణాలు కలిపి మొత్తం 4,400కు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇందుకోసం వివిధ పథకాల కింద రూ.1,128.02 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో వ్యయం కూడా పెరిగిందని తెలిపారు. గతంలో ఒక్కో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సుమారు రూ.17.50 లక్షలు ఖర్చు కాగా, ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఒక్కో కేంద్రానికి సుమారు రూ.36 లక్షల వరకు కేటాయిస్తున్నామని వివరించారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల పథకం కింద మరో సుమారు 700 కేంద్రాలను ఒక్కో కేంద్రానికి రూ.55 లక్షల చొప్పున అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ప్రతి 5 వేల జనాభాకు ఒకటి చొప్పున ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి కేంద్రంలో 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు, 71 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. బీపీ, మధుమేహం, మాతా శిశు ఆరోగ్యం, కంటి, నోటి ఆరోగ్యం, వృద్ధుల ఆరోగ్యం, అంటువ్యాధులను ముందుగానే గుర్తించేలా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైన వారికి ఉన్నత వైద్య సేవలకు పంపించడంతోపాటు, దూర వైద్య సేవల ద్వారా నిపుణుల సలహాలు అందించే విధానాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
{{/usCountry}}ప్రతి 5 వేల జనాభాకు ఒకటి చొప్పున ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి కేంద్రంలో 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు, 71 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. బీపీ, మధుమేహం, మాతా శిశు ఆరోగ్యం, కంటి, నోటి ఆరోగ్యం, వృద్ధుల ఆరోగ్యం, అంటువ్యాధులను ముందుగానే గుర్తించేలా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైన వారికి ఉన్నత వైద్య సేవలకు పంపించడంతోపాటు, దూర వైద్య సేవల ద్వారా నిపుణుల సలహాలు అందించే విధానాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
{{/usCountry}}ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి, భవిష్యత్తులో అవసరమైనప్పుడు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ‘సంజీవని’ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు సంఖ్యను కేటాయించి, వైద్య పరీక్షలు, మందులు, వైద్యుల సలహాలు, ఆసుపత్రుల్లో పొందిన చికిత్స వివరాలను భద్రపరిచే విధానం తీసుకొస్తున్నామని చెప్పారు.
దాదాపు 2,500 మంది సమన్వయకర్తల ద్వారా సేవలను ప్రజలకు చేరువ చేస్తామని, దూర వైద్యం, వైద్యుల సలహాలు, ఆసుపత్రి అపాయింట్‌మెంట్ వంటి సేవలను కూడా అనుసంధానం చేస్తామని తెలిపారు. జనవరి 1 నుంచి ఈ సేవలను ప్రారంభించే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
మారుమూల గ్రామాలకు వైద్య సేవలను తీసుకెళ్లేందుకు 930 మొబైల్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఒక్కో వాహనంలో 41 రకాల పరీక్షలు నిర్వహించే సదుపాయంతోపాటు సుమారు రూ.10 లక్షల విలువైన ఆటో అనలైజర్ పరికరం ఉంటుందని చెప్పారు.
ఈ వాహనాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామాలను సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. సాధారణంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చయ్యే కొన్ని పరీక్షలను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే గుర్తించి నివారించడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను తొలిదశలో గుర్తించి చికిత్స అందిస్తే భవిష్యత్తులో మూత్రపిండాలు, గుండె వంటి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని తెలిపారు.