గ్రామాల్లో వారికి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

రాష్ట్రంలో 27,500 గ్రామ సంఘ‌ స‌హాయ‌కుల‌కు( VAO ) స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయనున్నట్టుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. పేద‌ల ఇళ్లల్లో 20 ఏళ్ల క్రిత‌మే చంద్రబాబు వెలుగులు నింపారన్నారు.

Published on: Mar 26, 2026, 21:39:56 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రామీణ పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోన్న కూట‌మి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సంఘ‌ స‌హాయ‌కుల‌కు ( VAO )ల‌కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాల‌న్న నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రెండున్నర ద‌శాబ్దాల‌ కింద‌టే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వెలుగు ప‌థ‌కం ద్వారా పేద‌ల ఇళ్లల్లో వెలుగులు నింపేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశార‌ని మంత్రి చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

డ్వాక్రా సంఘాల ప‌టిష్టత‌కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా సెర్ప్ సంస్థ ఏర్పాటు చేశార‌ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. నాడు చంద్రబాబు మ‌దిలో వ‌చ్చిన ఈ ప‌థ‌కం ద్వారా గ్రామాల్లో 90 ల‌క్షల మంది మ‌హిళ‌లు 8.32 ల‌క్షల స్వయం స‌హాయ‌క సంఘాల్లో స‌భ్యులుగా స్వయంకృషితో ఎదుగుతున్నార‌ని మంత్రి తెలిపారు. ఈ స‌భ్యుల నుంచి ప్రతి గ్రామంలోనూ ఒక సంఘ సహాయ‌కురాలు(VAO) గా ఉన్న వారు త‌మ సంఘ సభ్యుల‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి, సీఐఎఫ్ లాంటి ఇత‌ర ఆర్థిక ప‌థ‌కాల ద్వారా స‌భ్యుల‌కు సాయం అందిస్తున్న నేప‌థ్యంలో వీరికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించ‌డం హ‌ర్షణీయం అని మంత్రి తెలిపారు.

ఈ సంఘ స‌హాయ‌కుల‌కు 2017లోనే తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ స‌హాయ‌కుల‌కు తొలిసారి ట్యాబ్‌లు ఇవ్వగా.. ఇప్పుడు కొత్తగా ఆండ్రాయిడ్ అప్లికేష‌న్లు రావ‌డం, డేటా సేక‌ర‌ణ కోసం స్మార్ట్‌ఫోన్లు కావాల‌ని గ్రామ సంఘ‌ స‌హాయ‌కులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన‌ట్టు మంత్రి కొండపల్లి చెప్పారు.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 27,500 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు అనుమ‌తులు ఇచ్చార‌న్నారు. ఈ ఫోన్లు శాంసంగ్ ఏ06 మోడ‌ల్‌లో 6 జీబీ ర్యామ్ - 128 జీబీ స్టోరేజ్ - చార్జర్ - కేస్ - ప్రొడ‌క్షన్ క‌వ‌ర్ - ఎండీఎం సాఫ్ట్‌వేర్ క‌లిగి ఉంటాయ‌ని... ఈ స్మార్ట్ ఫోన్లను ఏపీ టెక్నాల‌జీ స‌ర్వీసెస్ ద్వారా పార‌ద‌ర్శక టెండ‌ర్లలో కొనుగోలు చేసిన‌ట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More