ప్రపంచ తెలుగు మహాసభలు.. హాజరైన మారిషస్ అధ్యక్షుడు

ప్రపంచంలో 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ చెప్పారు. తెలుగు మహా సభలు.. బాష, నాగరికతను మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిర్వహించుకునే విధంగా ఉన్నాయన్నారు.

Published on: Jan 4, 2026, 17:04:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ మహ సభల్లో మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ధరమ్ బీర్ గోకుల్‌ను అశ్వరథంపై మహా సభల ప్రధాన వేదిక దగ్గరకు తీసుకెళ్లారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య, ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌తోపాటుగా పలువురు ప్రముఖులు వేదికపై ఉన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రపంచ తెలుగు మహాసభలు

అనంతరం సభలో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ మాట్లాడారు. ప్రపంచంలో 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని గోకుల్ చెప్పారు. తెలుగు మహాసభలు.. భాష, నాగరికతను మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిర్వహించుకునే విధంగా ఉన్నాయన్నారు. తెలుగు మహాసభల నిర్వహణ ఆంధ్ర సారస్వత పరిషత్తు దూరదృష్టికి నిదర్శనం అని చెప్పారు. తెలుగు భాష సంస్కృతిని ప్రాంతీయ వారసత్వాన్ని ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిపారన్నారు. భారత్‌లో తెలుగు మూడో అత్యధిక మంది మాట్లాడే భాషగా ఉందన్నారు.

తెలుగు భాష సంస్కతృతి ప్రవాసుల అంతర్భాగంలో ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, మారిషస్‌లో కూడా అంతే ప్రాముఖ్యం ఉందని ధరమ్ బీర్ గోకుల్ పేర్కొన్నారు. అక్కడి ప్రజలు కూడా ఎంతో వైభవంగా ఉగాదిని నిర్వహించుకుంటారని, మారిషస్‌లో సెలవు దినంగా ఉందని చెప్పారు.

'మహాసభ తెలుగు ప్రవాసుల గుర్తింపును తెలుపుతోంది. ఇది ఖండాల మధ్య అనుసంధానం పెంపొందిస్తోంది. ఇక్కడ జరిగిన చర్చల ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు గుర్తింపును బలపరుస్తాయి. భారత్, మారిషస్‌ల మధ్య సంబంధం ఉమ్మడి చరిత్ర, విలువలతో కలిగి ఉంది. పూర్వీకులు భారత పుణ్యభూమి నుంచి వచ్చి భాషలను పరిరక్షించారు. సంప్రదాయాలను కాపాడి తరతరాల పాటు వాటిని కొనసాగించారు.' అని మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ అన్నారు.

2025 మార్చిలో ప్రధాని మోదీ మారిషస్‌ను సందర్శించిన విషయాన్ని గోకుల్ గుర్తుచేశారు. ఆ తర్వాత మారిషస్ దేశ ప్రధాని భారత్‌ను సందర్శించడం భాగస్వామ్యం పురోగతి సాధించిందన్నారు. అధికారక రాజనీతికి మించి.. ఇరు దేశాల మధ్య సంబంధాలను నిలబెట్టేది ప్రజల అనుబంధమేనని చెప్పారు. భాష, సంస్కృతి ఇరుదేశాల సంబంధాలను కలుపుతున్నాయని వెల్లడించారు.

తెలుగు మహాసభల సందర్భంగా మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్‌కు ఆంధ్ర సారస్వత పరిషత్ భారతమిత్ర అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఉత్తరాఖండ్ ఆదిశంకరాచార్య పీఠం ఉత్తరాధికారి, గజల్ శ్రీనివాస్ అవార్డును అందజేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More