Ugadi: ఉగాది పండుగ 2026 ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో

Ugadi 2026: తెలుగు మాసాల ప్రకారం జరుపుకునే మొట్టమొదటి పండుగ ఉగాది పండుగ. పురాణాల ప్రకారం మనకు మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. అలాగే 12 తెలుగు మాసాలు ఉంటాయి. తెలుగు నెలల్లో మొట్టమొదటిది చైత్ర మాసం. చైత్ర మాసంలో వచ్చే పాడ్యమి నాడు అంటే మొదటి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము. 

Published on: Dec 10, 2025, 15:00:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ugadi 2026: తెలుగు మాసాల ప్రకారం జరుపుకునే మొట్టమొదటి పండుగ ఉగాది పండుగ. పురాణాల ప్రకారం మనకు మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. అలాగే 12 తెలుగు మాసాలు ఉంటాయి. తెలుగు నెలల్లో మొట్టమొదటిది చైత్రమాసం. చైత్రమాసంలో వచ్చే పాడ్యమి నాడు అంటే మొదటి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము.

ఉగాది పండుగ 2026 (pinterest)
ఉగాది పండుగ 2026 (pinterest)

బ్రహ్మ చైత్ర శుక్ల పాడ్యమి నాడు సృష్టిని ప్రారంభించాడని అంటారు. ఆ తిధినే కృతయుగం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. ఇక 2026లో ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది? ఉగాది పండుగ తేదీ, సమయంతో పాటుగా మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఉగాది పండుగ 2026

ఉగాది పండుగను ప్రతి ఏడాది చైత్ర మాసంలో వచ్చే శుక్లపక్ష పాడ్యమినాడు జరుపుకుంటాము. ఉగాది అంటే యుగానికి ప్రారంభం అని అర్థం. ‘యుగాది’ అనే పదం ‘ఉగాది’గా మారింది. విశ్వావసు నామ సంవత్సరం పూర్తవుతోంది. ఇక కొత్త తెలుగు సంవత్సరం రాబోతోంది. ఈసారి వచ్చే తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. పాడ్యమి తిధి మార్చి 19, 2026, గురువారం ఉదయం 6:53 గంటలకు మొదలవుతుంది.

తర్వాత రోజు అంటే మార్చి 20న ఉదయం 4:52 గంటలకు ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉగాది పండుగను జరుపుకుంటారు. మరాఠీలు గుడి పడవాగా, తమిళులు పుత్తాండుగా, మలయాళులు విషుగా, సిక్కులు వైశాఖిగా ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటున్నప్పటికీ దీని ఆధ్యాత్మికత ఒకటే.

ఉగాది పచ్చడి

ఉగాది నాడు ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తింటారు. ఉగాది పచ్చడిలో తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం అనే ఆరు రుచులు ఉంటాయి. ఈ ఆరు రుచులతో కూడిన పచ్చడి జీవితంలో సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలని సూచిస్తాయి. ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిదే. వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలనుండి కూడా దూరంగా ఉంచుతుంది. అందుకే ఉగాది రోజున దీనిని తప్పకుండా అందరూ తింటారు.

ఉగాది నాడు ఏం చేస్తారు?

ఉగాది నాడు ఆలయాలకు వెళ్లి పంచాంగ శ్రవణం చేస్తారు. కొత్త ఏడాదికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, రాశిఫలాలు, గ్రహస్థితులు, వర్షపాతం, అనుకూలతలు, ప్రతికూలతలు ఇలా ఎన్నో విషయాలను వినిపిస్తారు. అలాగే కవులు కవి సమ్మేళనాలు కూడా నిర్వహిస్తారు. కొత్త సంవత్సర ప్రారంభంలో అన్నీ బాగుండాలని, భవిష్యత్తులో అనందం ఉండాలని కోరుకుంటూ పండుగ చేసుకుంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More