ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. పలువురికి గాయాలు!
Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని, వేగంగా వస్తున్న తుపాన్ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

తాడిపత్రి ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లి, తిరిగి తుపాన్ వాహనంలో స్వగ్రామాలకు బయలుదేరారు. మార్గమధ్యలో రాయలచెరువు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి తుపాన్ వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. తెల్లవారుజాము సమయం కావడంతో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం, పొగమంచు కారణంగా ఆగి ఉన్న లారీని గుర్తించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే యాడికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న క్షతగాత్రులను స్థానికుల సాయంతో బయటకు తీసి, మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పంపించారు. మృతులను తాడిపత్రి మండలం నందలపాడు, కావేటి సముద్రం గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఒకే ప్రాంతానికి చెందిన నలుగురు మృతి చెందడంతో నందలపాడు, కావేటి సముద్రం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాయలచెరువు వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను జిల్లా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను తక్షణమే సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.
ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా రవాణా శాఖ, పోలీసు విభాగాలు సమన్వయంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా హైవేలపై వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు తగినంత విశ్రాంతి తీసుకోవాలని, ప్రజలు కూడా ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలే మన నిండు ప్రాణాలకు రక్షణ కవచంలా నిలుస్తాయి అని పేర్కొన్నారు.

E-Paper
