Jabardasth Comedians: జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొన్న కారు! ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

Jabardasth Comedians: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తమ కామెడీతో అలరించే జబర్దస్త్ కమెడియన్లు రైజింగ్ రాజు, దొరబాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో గాయాలపాలయ్యారు. ప్రస్తుతం భీమవరంలోని ఆసుపత్రిలో వీరికి చికిత్స అందుతోంది.

Published on: Nov 22, 2026, 17:13:46 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Jabardasth Comedians: ప్రముఖ తెలుగు టీవీ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ఇంటింటికీ పరిచయమైన కమెడియన్లు రైజింగ్ రాజు, దొరబాబు రోడ్డు ప్రమాదంలో గాయపడటం బుల్లితెర వర్గాల్లో కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో వారికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.

జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొన్న కారు! ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?
జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొన్న కారు! ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

కారు నుజ్జునుజ్జు

ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు దొరబాబు, రైజింగ్ రైజు కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో ప్రయాణిస్తుండగా ఈ అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జయింది. జబర్దస్త్ కమెడియన్లకు గాయాలయ్యాయి.

అసలు ఏం జరిగింది?

కాకినాడ నుంచి భీమవరం వెళ్తున్న క్రమంలో పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం సమీపంలోకి రాగానే దొరబాబు, రైజింగ్ రాజు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. వేగంగా దూసుకెళ్లిన వాహనం రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రైజింగ్ రాజు, దొరబాబు గాయపడగా.. వాహనం నడుపుతున్న కారు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న క్షతగాత్రులను జాగ్రత్తగా బయటకు తీసి, తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

ప్రమాదం జరిగిన వెంటనే దొరబాబు, రైజింగ్ రాజుతో పాటు డ్రైవర్ ను తొలుత స్థానిక ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో రైజింగ్ రాజు, దొరబాబులతో పాటు డ్రైవర్‌కు చికిత్స అందిస్తున్నారు.

కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ కమెడియన్లు ఇద్దరికీ ప్రాణాపాయం తప్పిందని తెలియడంతో కుటుంబ సభ్యులు, తోటి కళాకారులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి అధికారిక వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రమాద సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెల్లవారుజామున ప్రయాణం కావడంతో డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్ల కారు అదుపుతప్పిందా, లేక అతివేగం, సాంకేతిక లోపం వంటివి ఏమైనా కారణమయ్యాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరోవైపు తమ అభిమాన కమెడియన్లకు ప్రమాదం జరిగిందని తెలిసి సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘జబర్దస్త్’ స్కిట్లతో ప్రతి వారం కడుపుబ్బా నవ్వించే రైజింగ్ రాజు, దొరబాబు త్వరగా కోలుకుని మళ్లీ తమ నటనతో అలరించాలని ఫ్యాన్స్, బుల్లితెర ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.