శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధిలో అత్యంత తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న రైలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో విద్యార్థికి గాయాలు అయ్యాయి. మృతులంతా స్థానిక ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌కు చెందిన విద్యార్థులుగా అధికారులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, రైల్వే భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి పట్టణ శివారులోని బర్మా కాలనీ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు రైల్వే ట్రాక్ వైపు వెళ్లారు. అదే సమయంలో వేగంగా వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దాడికి నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు విద్యార్థులను పోలీసులు గుర్తించారు. విశాఖరావు, దిలీప్, శరత్, శివగా గుర్తించారు. ప్రమాదం జరిగిందనే వార్త తెలియగానే విద్యార్థుల కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. కళ్లముందే చేతికి అందివచ్చిన పిల్లలు మృతదేహాలుగా పడి ఉండడంతో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో టెక్కలి ప్రాంతమంతా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. రైల్వే అధికారులు, పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన తీరుపై, రైలు వస్తున్న సమయంలో విద్యార్థులు గమనించకపోవడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
టెక్కలి సమీపంలో రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ఢీకొని విశాఖరావు, దిలీప్ కుమార్, శివ, శరత్ కుమార్ అనే నలుగురు విద్యార్థులు మృతి చెందడం విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనపై అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. రైలు రాకను గమనించలేకపోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. ప్రమాదంలో సాల్మన్రాజ్ అనే మరో విద్యార్ధి గాయపడ్డారని, అతనికి ప్రస్తుతం టెక్కలి డీహెచ్లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సాల్మన్రాజుకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, మద్దతుగా నిలవాలని అధికారులను ఆదేశించారు.
{{/usCountry}}టెక్కలి సమీపంలో రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ఢీకొని విశాఖరావు, దిలీప్ కుమార్, శివ, శరత్ కుమార్ అనే నలుగురు విద్యార్థులు మృతి చెందడం విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనపై అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. రైలు రాకను గమనించలేకపోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. ప్రమాదంలో సాల్మన్రాజ్ అనే మరో విద్యార్ధి గాయపడ్డారని, అతనికి ప్రస్తుతం టెక్కలి డీహెచ్లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సాల్మన్రాజుకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, మద్దతుగా నిలవాలని అధికారులను ఆదేశించారు.
{{/usCountry}}