ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. వాల్తేర్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న నాలుగు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్చనుంది ఇండియన్ రైల్వే. చాలా డిమాండ్ ఉన్న వీక్లీ స్పెషల్ రైళ్లను రెగ్యులర్ వీక్లీ రైళ్లుగా నడిపేందుకు నిర్ణయించారు అధికారులు.
- విశాఖపట్నం-తిరుపతి(08583/08584) వీక్లీ స్పెషల్ రైలును ఇకపై 18507/18508 నంబర్లతో రెగ్యులర్ వీక్లీ రైళ్లుగా నడవనున్నాయి.
- మరో విశాఖపట్నం-తిరుపతి(08547/08548) వీక్లీ స్పెషల్ రైలు.. ఇక మీదట 18505/18506 నంబరుతో రాకపోకలు సాగిస్తుంది.
- విశాఖపట్నం-ఎస్ఎంవీ బెంగళూరు(08581/08582) వీక్లీ స్పెషల్ రైలు.. 18509/18510 నంబరుతో నడవనుంది.

అలాగే.. విశాఖపట్నం-చర్లపల్లి(08579/08580) వీక్లీ ప్రత్యేక రైలు.. 18527/18528 నంబరుతో రెగ్యులర్ వీక్లీ రైళ్లుగా మారుతాయి.
ఈ రైళ్లు కూడా మార్పు
- రైలు నెంబర్ 07191/07192 కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్ ప్రెస్(రైలు నం. 17165/17616) గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో మొదలై మరుసటి రోజు మంగళవారం రాత్రి 10:45 గం.లకు కేరళ రాష్ట్రంలోని ట్యూటికోరిన్ కు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు మొదలై మరుసటిరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఈ రైలు రెండు షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
- హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలు(రైలు నం. 07230/07229)ను హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్(రైలు నం. 17069/17070) గా మార్చారు. ఈ రైలు గతంలోలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా గతంలో లాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
- చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలు(రైలు నం. 07225/07226)ను చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్(రైలు నం. 17065/17066) గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమబెంగాల్ షాలిమార్‌కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గం. లకు షాలిమార్ లో బయలుదేరి మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ రైలు కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.