Hyderabad Tour : హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ వస్తారా? క్విక్ సిటీ టూరిజానికి ప్లానింగ్
Hyderabad Tour : హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ వచ్చినప్పుడు వెళ్లి సిటీని చూడాలని కొందరికి మనసు లాగుతుంది. కానీ టైమింగ్ కారణంగా ఇబ్బందులు వస్తాయేమోనని భయంతో ఆగిపోతారు. ఇక మీదట అలాంటి భయాలు అవసరం లేదు.
హైదరాబాద్ నుంచి చాలా వరకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. చాలాసేపు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో బోర్ కొడుతుంది. అలాంటి బోర్ ఫీల్‌కు బైబై చెప్పేందుకు రెడీ అవ్వండి. ఎందుకంటే తెలంగాణ టూరిజం సరికొత్తగా ప్లాన్ చేస్తోంది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) గుండా ప్రయాణించే ప్రయాణికుల కోసం తెలంగాణ టూరిజం స్వల్పకాలిక పర్యాటక అనుభవాలను ప్లాన్ చేస్తోంది. కనెక్టింగ్ విమానాల మధ్య కొన్ని ఖాళీ గంటల సమయం దొరుకుతుంది. ప్రయాణికులు తమ తదుపరి ప్రయాణం వరకు ఎయిర్‌పోర్ట్‌లోనే వెయిట్ చేయకుండా టూరిజం శాఖ ప్లాన్ చేస్తోంది. నగరంలోని వారసత్వ ప్రదేశాలు, ఇతర ఆకర్షణలను ప్రయాణికులు సందర్శించవచ్చు.
ఎయిర్‍పోర్ట్‌లో కొన్ని గంటలు ఉండాల్సిన ప్రయాణికులు హైదరాబాద్ సిటీకీ వచ్చి ముఖ్యమైన ప్రదేశాలు చూడవచ్చు. ప్రయాణికులకు అనుగుణంగా సౌకర్యవంతమైన పర్యాటక ప్యాకేజీలను రూపొందించాలనే ఆలోచన చేస్తోంది తెలంగాణ టూరిజం శాఖ. విమానాశ్రయంలో టూరిజం కియోస్క్ ద్వారా ప్రయాణికులు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి అనేక రకాల ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.
ఇది ఎలాగా ఉంటుందంటే.. ఒకే ప్రదేశాన్ని సందర్శించడం లేదా హైదరాబాద్‌లోని పలు గమ్యస్థానాలను వెళ్లడంలాంటివి ఉంటాయి. ప్యాకేజీలలో రౌండ్ ట్రిప్‌లకు రవాణా ఏర్పాట్లు ఉంటాయి. ప్రయాణికులు వారి కనెక్టింగ్ విమానాల కోసం సకాలంలో విమానాశ్రయానికి తిరిగి రావడానికి పర్యాటక శాఖ వీలు కల్పిస్తుంది.
క్యాబ్ అగ్రిగేటర్లతో ఈ మేరకు టూరిజం డిపార్ట్‌మెంట్ మాట్లాడనుంది. పర్యాటక అవగాహనలో రాపిడో డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని రాపిడో కెప్టెన్లు సిటీ టూరిజం గురించి ప్రాథమిక జ్ఞానాన్ని తెచ్చుకునేలా వర్చువల్ శిక్షణా కోర్సులో పాల్గొంటారు. తద్వారా ప్రయాణాల సమయంలో సందర్శకులకు మార్గనిర్దేశం చేస్తారు. గ్యాస్ట్రోనమీ, వెల్నెస్, ముత్యాలు అండ్ షాపింగ్‌పై దృష్టి సారించే మూడు విధానాల ద్వారా హైదరాబాద్, తెలంగాణను అంతర్జాతీయంగా బ్రాండ్ చేయడానికి వ్యూహాన్ని పర్యాటక శాఖ రచించనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


