మూసీ చుట్టూ నైట్ టూరిజం.. రాత్రి వ్యాపారాలు చేసుకునేలా ప్లాన్ : సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నైట్ టూరిజం డెవలప్ చేస్తామని చెప్పారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరక్కుండా అందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉండొచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఎవరినీ అనాథలను చేయం. భూమి పోయినా, ఇండ్లు పోయినా ప్రభుత్వం మంచి నష్టపరిహారమిచ్చి ఆదుకుంటుంది. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.' అని ముఖ్యమంత్రి చెప్పారు.

బుద్వేల్ లేఅవుట్‌తో కలిపే రేడియల్ రోడ్-2 ఇంటర్‌చేంజ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్వాలగూడలో ఎకో పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.
మూసీ నది పూర్తిగా మురికితో నిండిపోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు కాలం మారిందని, భవిష్యత్తు మారుతోందన్నారు. దానికి అనుగుణంగా మహానగరానికి ప్రణాళికలు మార్చుకోవాలన్నారు. ప్రజలు ఎవరూ మురికిలో బతకాలనుకోరని, విధిలేక మురికికూపాల్లో నివసిస్తున్నారని చెప్పారు. ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలన్నారు.
పేదల గురించి ఆలోచించి అందరినీ మెప్పించి, ఒప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ అభివృద్ధిలో ఇక్కడి వారందరినీ భాగస్వామ్యం చేస్తామన్నారు. ఎక్కడ ఉన్న వాళ్లకు అక్కడే ఇండ్లు కట్టించడానికి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
'రీజినల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్లు వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా, ఎవరిదో ఒకరిది భూమి కోల్పోవాల్సిన పరిస్థితి. భూమి కోల్పోయిన దు:ఖం ఉంటది. కానీ వేరే దగ్గర భూమి కొనుక్కునేంతగా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత నాది. అహ్మదాబాద్‌లో సబర్మతీ నది రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్‌ఫ్రంట్, ఉత్తరప్రదేశ్‌లో గంగానది రివర్ ఫ్రంట్ ఎలాగైతే అభివృద్ధి చేశారో, హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాం. దీని చుట్టూ రాత్రి పూట వ్యాపారాలు చేసుకునే ఏర్పాట్లు చేస్తాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం చెప్పారు. శాంతిభద్రతలను పటిష్టం చేస్తామన్నారు. నైట్ టూరిజంకు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి ఆయా నియోజకవర్గాల్లోనే ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు.
గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలతో ప్రపంచంలోనే అందమైన నగరంగా హైదరాబాద్ విలసిల్లిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి హైదరాబాద్ మహా నగరం చెత్త చెదారంతో నిండిపోయిందన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ను తిరిగి అద్భుతంగా తీర్చిదిద్దాలనుకుంటే కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
'హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించే సమయంలో కూడా కొందరికి నష్టం జరిగింది. కానీ అదే విమానాశ్రయం ఇప్పుడు పెద్ద ఆస్తిగా మారింది. చిన్న కాలనీలు కాకుండా పెద్ద నగరమే నిర్మించాలన్న లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. శంషాబాద్ ప్రాంతం బుల్లెట్ ట్రెయిన్ హబ్‌గా మారనుంది. బెంగుళూరు, అమరావతి, పూణె, చెన్నై నగరాలకు ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రెయిన్ సౌకర్యాలు రాబోతున్నాయి. దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. ట్రంప్, ఎలాన్ మస్క్ లకు సంబంధించిన సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయి.' అని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు ముఖ్యమంత్రి ఎకో హిల్ పార్క్‌ను సందర్శించడంతో పాటు బర్డ్స్ ఏవియరీని ప్రారంభించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












