మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ జరుగుతోంది - కేటీఆర్

మూసీ ప్రాజెక్టు పేరిట లక్షన్నర ఇళ్ల కూల్చివేతకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ జరుగుతోందని దుయ్యబట్టారు. మూసీ అభివృద్ధి పేరుతో వేల కోట్ల అవినీతికి ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Published on: Mar 05, 2026 4:26 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎలాంటి విధ్వంసం లేకుండా కూడా మూసీని సుందరీకరణ చేయవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటికి నష్టం జరగకుండా మూసీని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఇవాళ నాగోల్ ప్రాంతంలో మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధిని కేటీఆర్ పరిశీలించారు. మూసీ ప్రణాళికలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూసీ ప్రాజెక్ట్ బాధితులతో కేటీఆర్
మూసీ ప్రాజెక్ట్ బాధితులతో కేటీఆర్

బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ - కేటీఆర్

మూసీ ప్రాజెక్టు పేరిట లక్షన్నర ఇళ్ల కూల్చివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. “పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపితే బీఆర్‌ఎస్ అడ్డుకుంటుంది. మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ జరుగుతోంది. రూ. 16 వేల కోట్ల ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచే కుట్ర చేస్తున్నారు. మూసీ అభివృద్ధి పేరుతో వేల కోట్ల అవినీతి ప్రయత్నం చేస్తోంది. పేదల ఇళ్లకు రెడ్ మార్కులు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతోంది” అని కేటీఆర్ దుయ్యబట్టారు.

"రూ. 16 వేల కోట్లతోని పూర్తయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి పెంచిండు. రెండున్నరేళ్ళు అయింది కానీ కనీసం డీపీఆర్ లేదు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిన ఇండ్లకు రెడ్ మార్క్ వేస్తున్నారు. అధికారులు వచ్చి అనధికారికంగా బెదిరిస్తున్నారు"అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాలో ఇందిరమ్మ రాజ్యం కాదు.. బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. “మూసీ అభివృద్ధికి మద్దతు.. పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకం. నాగోల్‌లో ఎవరికీ ఇబ్బంది లేకుండా మూసీ అభివృద్ధి చేశాం. మూసీ పేరిట హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టిస్తోంది కాంగ్రెస్. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై అసెంబ్లీలో పోరాడతాం. కాంగ్రెస్ గ్యారెంటీలు కాదు.. ప్రజలకు భయమే మిగిలింది. పేదల ఇళ్లను కూల్చి అవినీతి చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More