మూసీ ప్రాజెక్ట్ బాధితుల దండి మార్చ్ - అండగా ఉంటామని కేటీఆర్ హామీ
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని కేటీఆర్ విమర్శించారు.మూసీ పేరిట చేస్తున్న స్కామ్ కోసం వేలాదిమంది ఇండ్లను కూలకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు.
మూసీ బాధితులకు మా పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు.మూసీ బాధిత కుటుంబాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబాలతో దండి మార్చ్…
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలతో మూసీ దండి మార్చ్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మూడున్నర కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…. రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇండ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం రియల్ ఎస్టేట్ దందా చేయడం మాత్రమేనని దుయ్యబట్టారు. దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ముఖ్యమంత్రి ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తన పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్ట్ గాని, ఒక్క ఇల్లు గాని, ఒక్క రోడ్డు గాని వేయకుండా కేవలం విధ్వంసమే తన విధానంగా పెట్టుకుని ముందుకు పోతున్నారు” అని కేటీఆర్ విమర్శించారు.
ఎవరి భూములు పోకుండా చూస్తాం - కేటీఆర్
ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని… తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.
“ముఖ్యమంత్రి ఇప్పటికే అద్భుతమైన ప్రగతి భవన్ సిద్ధంగా ఉన్నా దాన్ని కాదని చెప్పి 200 కోట్ల రూపాయలతో తనకంటూ ఒక నివాసం నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. అయినా రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు మాత్రం వందల కోట్ల ఇళ్లు కావాలి. కానీ పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్‌మెంట్ ఉండకుండా ఎందుకు ఈ విధ్వంసం…?” కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇళ్లను కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారని కేటీఆర్ ఆరోపించారు. “అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో వందల మంది ఇళ్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి, అటు రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగేలా, వారి జీవితాలను చిన్నాభిన్నం చేసేలా ఇళ్లు కూలగొడుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం తన అనుచరులకు, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారు” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 16 వేల కోట్ల రూపాయలతోనే మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టామని కేటీఆర్ గుర్తు చేశారు. ఒక్క ఇల్లు కూడా పోకుండా డీపీఆర్ (DPR) ని కూడా సిద్ధం చేశామని గుర్తు చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

