మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై కీలక అప్డేట్.. ఆ పని మెుదలుపెట్టిన సర్కార్!
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మెుదలుపెట్టింది.
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై కీలక పరిణామం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నదీ తీర అభివృద్ధి కోసం అధికారికంగా భూసేకరణ ప్రారంభించడంతో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి ప్రధాన అడుగు పడినట్టైంది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌తో ఎంపిక చేసిన ప్రాంతాలలో భూసేకరణను అధికారికంగా ప్రారంభమైంది.

ఈ మేరకు మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మెుదలుపెట్టింది. ప్రతిష్టాత్మకమైన మూసీ నది పునరుజ్జీవన ప్రణాళికకు అవసరమైన భూమిని సేకరించడానికి అధికారులు ప్రాథమిక పనులను ప్రారంభించారు. ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు పరిధిలో భూసేకరణ చేపట్టనున్నారు అధికారులు.
మొదటి దశలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని గోల్కొండ, గండిపేట మండలాల్లో 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఇప్పటికే సర్వే నంబర్లు, గ్రామాల వివరణాత్మక జాబితాను విడుదల చేశారు. అధికారులు భూ యజమానులకు న్యాయమైన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
భూ యజమానులు హక్కుల పత్రాలు(పట్టాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు) తగిన సమయంలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత సమయంలో తెలియజేయాలని అధికారులు సూచనలు చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
భూ యజమానుల నుండి అభ్యంతరాలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. అనుమానాలు ఉన్నవారు నోటిఫికేషన్‌లో పేర్కొన్న గడువులోపు రాతపూర్వకంగా అడగాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలను విస్తరించి ఉంటుంది . ఇది 14 మండలాలు, 46 గ్రామాలను కవర్ చేస్తుంది. నదికి 55 కిలోమీటర్ల విస్తీర్ణంలో దశలవారీగా అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు మూసీ నదిని శుభ్రపరచడం, పరిసర ప్రాంతాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మూసీ వెంబడి పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
భూసేకరణ ఊపందుకుంటున్నందున నిర్మాణాలకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రాథమిక సేకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు అమలు దశలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సర్వే నెంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను ఇప్పటికే ప్రకటించారు. Land Acquisition Act, 2013 నిబంధనల ప్రకారం భూసేకరణ ప్రక్రియ చేపడుతారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూసీ అభివృద్ధి పనులు దశలవారీగా జరగనున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


