ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. ఒక ప్రయాణికుడి బ్యాగ్ పొరపాటున మరో ప్రయాణికుడి వద్దకు మారిన (బాగేజ్ మిక్స్-అప్) ఘటనలో…. దాదాపు ఐదు కిలోల బరువు కలిగిన 46 జిలెటిన్ స్టిక్స్ ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
బ్యాగ్ మిస్సింగ్… తెరిచి చూస్తే…

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. మంగళవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఉన్న ఒక ప్రయాణికుడు తన ప్రయాణం ముగించుకుని, తన బ్యాగ్ అనుకుని పొరపాటున వేరొకరి బ్యాగ్‌ను తీసుకున్నాడు. అయితే అది తన బ్యాగ్ కాదని సదరు ప్రయాణికుడు త్వరగానే గుర్తించాడు. కానీ ఆ సంచిలో జిలెటిన్ స్టిక్స్ గానీ, ఎలాంటి ఇతర ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయనే విషయాన్ని గానీ ఆయన ఊహించలేకపోయాడు.
ఈ క్రమంలోనే ఆ ప్రయాణికుడు స్వయంగా స్పందించి…. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. "ఈ బ్యాగ్ నాది కాదు, పొరపాటున నా వద్దకు వచ్చింది. నా అసలు బ్యాగ్ బస్టాండ్‌లోనే ఎక్కడో పోయింది," అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ బ్యాగ్‌ను తెరిచి పరిశీలించగా, అందులో ఏకంగా 46 జిలెటిన్ స్టిక్స్ బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
"ఒక ప్రయాణికుడి బ్యాగ్ మారినట్లు మాకు సమాచారం వచ్చింది. ఆ ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదుతో సంచిని తనిఖీ చేయగా దాదాపు ఐదు కిలోల బరువున్న 46 జిలెటిన్ స్టిక్స్ లభించాయి," అని విజయవాడ సౌత్ జోన్ సహాయ కమిషనర్ కె. మానస వివరించారు.
ఈ పేలుడు పదార్థాలను ఏదైనా క్వారీ లేదా రాళ్ల గుట్టలను పేల్చే పనుల నిమిత్తం తరలిస్తున్నారా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని…. అసలు ఆ సంచి ఎవరిది? అంత పెద్ద మొత్తంలో జిలెటిన్ స్టిక్స్‌ను విజయవాడ బస్టాండ్ మీదుగా ఎక్కడికి, ఎవరు తీసుకెళ్తున్నారు? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. బస్టాండ్‌లోని సీసీటీవీ విజువల్స్‌ను సైతం అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
{{/usCountry}}ఈ పేలుడు పదార్థాలను ఏదైనా క్వారీ లేదా రాళ్ల గుట్టలను పేల్చే పనుల నిమిత్తం తరలిస్తున్నారా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని…. అసలు ఆ సంచి ఎవరిది? అంత పెద్ద మొత్తంలో జిలెటిన్ స్టిక్స్‌ను విజయవాడ బస్టాండ్ మీదుగా ఎక్కడికి, ఎవరు తీసుకెళ్తున్నారు? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. బస్టాండ్‌లోని సీసీటీవీ విజువల్స్‌ను సైతం అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
{{/usCountry}}