Vijayawada : విజయవాడ బస్టాండ్‌లో షాకింగ్ ఘటన - బ్యాగ్‌లో పేలుడు పదార్థాలు

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ప్రయాణికుడి బ్యాగ్ పొరపాటున మారడంతో 5 కేజీల బరువున్న 46 జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర విచారణ జరుపుతున్నారు. !

Published on: Sep 16, 2026, 06:34:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. ఒక ప్రయాణికుడి బ్యాగ్ పొరపాటున మరో ప్రయాణికుడి వద్దకు మారిన (బాగేజ్ మిక్స్-అప్) ఘటనలో…. దాదాపు ఐదు కిలోల బరువు కలిగిన 46 జిలెటిన్ స్టిక్స్ ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

విజయవాడ రైల్వే స్టేషన్
విజయవాడ రైల్వే స్టేషన్

బ్యాగ్ మిస్సింగ్… తెరిచి చూస్తే…

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. మంగళవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఉన్న ఒక ప్రయాణికుడు తన ప్రయాణం ముగించుకుని, తన బ్యాగ్ అనుకుని పొరపాటున వేరొకరి బ్యాగ్‌ను తీసుకున్నాడు. అయితే అది తన బ్యాగ్ కాదని సదరు ప్రయాణికుడు త్వరగానే గుర్తించాడు. కానీ ఆ సంచిలో జిలెటిన్ స్టిక్స్ గానీ, ఎలాంటి ఇతర ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయనే విషయాన్ని గానీ ఆయన ఊహించలేకపోయాడు.

ఈ క్రమంలోనే ఆ ప్రయాణికుడు స్వయంగా స్పందించి…. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. "ఈ బ్యాగ్ నాది కాదు, పొరపాటున నా వద్దకు వచ్చింది. నా అసలు బ్యాగ్ బస్టాండ్‌లోనే ఎక్కడో పోయింది," అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ బ్యాగ్‌ను తెరిచి పరిశీలించగా, అందులో ఏకంగా 46 జిలెటిన్ స్టిక్స్ బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

"ఒక ప్రయాణికుడి బ్యాగ్ మారినట్లు మాకు సమాచారం వచ్చింది. ఆ ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదుతో సంచిని తనిఖీ చేయగా దాదాపు ఐదు కిలోల బరువున్న 46 జిలెటిన్ స్టిక్స్ లభించాయి," అని విజయవాడ సౌత్ జోన్ సహాయ కమిషనర్ కె. మానస వివరించారు.

ఈ పేలుడు పదార్థాలను ఏదైనా క్వారీ లేదా రాళ్ల గుట్టలను పేల్చే పనుల నిమిత్తం తరలిస్తున్నారా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని…. అసలు ఆ సంచి ఎవరిది? అంత పెద్ద మొత్తంలో జిలెటిన్ స్టిక్స్‌ను విజయవాడ బస్టాండ్ మీదుగా ఎక్కడికి, ఎవరు తీసుకెళ్తున్నారు? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. బస్టాండ్‌లోని సీసీటీవీ విజువల్స్‌ను సైతం అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More