కొత్త సంవత్సరం వేళ 22ఏ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
సుమోటోగా తొలిగించాలని - మంత్రి అనగాని

ప్రైవేటు భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూముల పత్రాలుంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు.
స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా 22ఏ నుంచి తొలగించాలని… రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22ఏ నుండి తొలగించాలని మంత్రి అనగాని పేర్కొన్నారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమాధికారి సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుందన్నారు. 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్‌ఏ వంటి పాత రెవెన్యూ రికార్డులున్నా సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత… 22ఏ భూముల వివాదంపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. నిషిద్ధ జాబితా (22ఏ)లోకి ప్రైవేటు భూములను అక్రమంగా చేర్చినట్లు అందిన ఫిర్యాదులపై లోతుగా విచారణ చేపట్టింది. కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఫిర్యాదులపై కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు సంబంధిత ప్రాంతాల ఆర్డీఓలతో విచారణ చేయించేలా చర్యలు తీసుకుంది. సమగ్ర పరిశీలన అనంతరం నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలని.. లేదా కొనసాగించాలని ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు భూములు నిషిద్ధ జాబితా (22 ఏ, బీ, సీ, డీ, ఈ)లో ఉండకూడదని స్పష్టం చేసింది.
కొన్నిచోట్ల సబ్ డివిజన్ వారీగా కాకుండా... సర్వే నంబరులో ఉన్న భూమి మొత్తాన్ని నిషిద్ధ జాబితాలోకి చేర్చారు. వీటిపై కూడా విచారణ జరిపి… చర్యలు తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాత…తాజాగా 5 రకాల భూములను పూర్తిగా 22ఏ జాబితా నుంచి తొలగించారు. మరో 4 రకాల భూములపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
{{/usCountry}}కొన్నిచోట్ల సబ్ డివిజన్ వారీగా కాకుండా... సర్వే నంబరులో ఉన్న భూమి మొత్తాన్ని నిషిద్ధ జాబితాలోకి చేర్చారు. వీటిపై కూడా విచారణ జరిపి… చర్యలు తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాత…తాజాగా 5 రకాల భూములను పూర్తిగా 22ఏ జాబితా నుంచి తొలగించారు. మరో 4 రకాల భూములపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
{{/usCountry}}