రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమల్లో ఉన్న జోన్‌ల విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేసిది. దీంతో రాష్ట్రంలో 26 జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. 1975 నాటి పాత ఆర్డర్ స్థానంలో 'ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005' అమల్లోకి రావడంతో ఉద్యోగాల కేటాయింపులో పెనుమార్పులు జరగనున్నాయి.
ముఖ్యమైన మార్పులు ఇవే

ఇప్పటివరకు జిల్లా స్థాయిలో 80 శాతం, జోనల్ స్థాయిలో 70 శాతం ఉన్న స్థానిక కోటాను ఇకపై అన్ని స్థాయిల ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతానికి పెంచారు. మిగిలిన 5 శాతం మాత్రమే ఓపెన్ కేటగిరీ కింద ఉంటుంది.
వచ్చే 27 నెలల్లోపు అన్ని పోస్టులను కొత్త కేడర్‌లలోకి సర్దుబాటు చేయాలని కేంద్రం స్పష్టమైన గడువు విధించింది.
పోస్టుల వర్గీకరణ
కొత్త నిబంధనల ప్రకారం జూనియర్ అసిస్టెంట్, దానికి సమానమైన, దానికంటే తక్కువస్థాయి పోస్టులకు(నాన్ గెజిటెడ్), ఉపాధ్యాయ పోస్టులకు జిల్లా యూనిట్‌గా పరిణగిస్తారు. అదే జూనియర్ అసిస్టెంట్ కంటే పైస్థాయి నుంచి సూపరింటెండెంట్ వరకు, ఒకటో స్థాయి గెజిటెడ్ పోస్టులకు జోన్ యూనిట్‌గా చూస్తారు. ఇక ఆ పై స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు, వాటికి సమానమైన పోస్టులకు మల్టీ జోన్‌ను లోకల్ ఏరియా/కేడర్ యూనిట్‌గా చూడాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా.. రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉన్నవి ఇకపై మల్టీజోన్ పోస్టులుగా అవుతాయి.
మినహాయింపులు: ఏపీ సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, ప్రత్యేక కార్యాలయాలు, రాజధాని ప్రాంత పోలీస్ ఉద్యోగాలకు లోకల్ నిబంధనలు వర్తించవు.
కొత్త జోన్‌ల విభజన ఇలా..
రాష్ట్రంలోని 26 జిల్లాలను రెండు మల్టీ జోన్లుగా, ఆరు జోన్లుగా విభజించారు.
మల్టీ జోన్ - 1
{{/usCountry}}రాష్ట్రంలోని 26 జిల్లాలను రెండు మల్టీ జోన్లుగా, ఆరు జోన్లుగా విభజించారు.
మల్టీ జోన్ - 1
{{/usCountry}}జోన్ 1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి.
జోన్ 2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ.
జోన్ 3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా.
మల్టీ జోన్ - 2
జోన్ 4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు.
జోన్ 5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప.
జోన్ 6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి.
రాష్ట్రంలో కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పడటంతో, మొత్తం 28 జిల్లాలకు అనుగుణంగా కొత్త గెజిట్ నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం మళ్లీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. ఒకవేళ స్థానిక అభ్యర్థులు లభించకపోతే, ఆ పోస్టులను 3 ఏళ్ల వరకు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. కనీసం ఒక పోస్టునైనా ఓపెన్ కేటగిరీగా ఉంచాలనే నిబంధన ఉంది.