కిడ్నీ రోగులకు శుభవార్త - కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు..! ఎక్కడెక్కడంటే...?
కిడ్నీ రోగుల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కొక్క కేంద్రంలో సుమారు రూ.75 లక్షలు విలువచేసే 3 రక్త శుద్ధి యంత్రాలు/పరికరాలు సమకూరుతాయని మంత్రి సత్య కుమార్ యాదవ్ ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో అదనంగా 7 కొత్త డయాలసిన్ (రక్త శుద్ధి) కేంద్రాలను ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలను వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం రోజు జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

విజయనగరం జిల్లా ఎస్.కోట, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, చిత్తూరు జిల్లా పీలేరు ఏరియా ఆసుపత్రుల్లో, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, ఎస్పీఎస్ఆర్ జిల్లా వెంకటగిరి, బాపట్ల జిల్లా అద్దంకి, నంద్యాల జిల్లా సున్నిపెంట సీహెచ్‌సీ అనువత్రుల్లో ఈ డయాలసిస్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటవుతాయి. ప్రతి కేంద్రంలో ప్రతి రోజూ మూడు సెషన్ల ద్వారా 15 మందికి చొప్పున రక్త శుద్ది జరుగుతుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.
- ప్రధానమంత్రి నేషనల్ డయాలసిన్ ప్రోగ్రాం (పిఎంఎన్డీపీ) కింద ఏర్పాటు కానున్న ఒక్కొక్క కేంద్రంలో సుమారు రూ.75 లక్షలు విలువచేసే 3 రక్త శుద్ధి యంత్రాలు/పరికరాలు సమకూరుతాయి.
- ప్రస్తుతం రాష్ట్రంలో 232 కేంద్రాలు పనిచేస్తున్నాయి. రానున్న కొత్తవాటితో కలిపి వీటి సంఖ్య 239కు చేరుకుంటుంది.
- ఎన్.కోట, సీతంపేట ఆసుపత్రుల్లోని కేంద్రాలు సిద్ధం ఎస్.కోట, సీతంపేట ఆసుపత్రుల్లో కొత్త డయాలసిస్ కేంద్రాలు త్వరలో పనిచేయనున్నాయి.
- పీపీపీ విధానంలో వీటి నిర్వహణ బాధ్యతలను ఓ సంస్థకు అప్పగించారు. మిగిలిన కేంద్రాలను కూడా పీపీపీ విధానంలో నడిపేందుకు టెండర్లు పిలవాలని రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస (ఏపీఎంఎస్ఐడీసీ)ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కోరింది.
- ఒక్కొక్క కేంద్రంలో 5 చొప్పున ఆధునిక రక్త శుద్ది యంత్రాలు అందుబాటులోకొస్తాయి. ప్రతి కేంద్రానికి అనుబంధంగా ప్రత్యేకంగా ఆర్వోప్లాంటు ఉంటుంది. ఈ కొత్త కేంద్రాల ఏర్పాటువల్ల డయాలసిస్ కోసం కిడ్నీ (మూత్రపిండాలు) రోగాలతో బాధపడేవారు దూర ప్రాంతాలకు వ్యయప్రయాసలతో వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.
- రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 232లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుబంధంగా పీపీపీ విధానంలో 173 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిల్లో 153 కేంద్రాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మిగిలినవి బోధన, ఇతర ఆసుపత్రుల్లో ఉన్నాయి. వీటి ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో వేలాది మంది రోగులు 10,62,008 సార్లు డయాలసిస్ చేయించుకున్నారు.
- ప్రధానమంత్రి నేషనల్ డయాలసిన్ ప్రోగ్రాం (పీఎంఎన్డీపీ) ఆధ్వర్యంలో 59 డయాలసిస్ కేంద్రాలు వనిచేస్తున్నాయి. వీటి ద్వారా కూడా అధిక సంఖ్యలో రోగులకు 4,95,186 సార్లు డయాలసిస్ జరిగింది. ఈ కేంద్రాలు జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో ఉన్నాయి. వైద్యుల సిఫారసు మేరకు రోగులకు సగటున నెలకు 6 నుంచి 8 సార్లు ఉచితంగా రక్తశుద్ధి చేస్తున్నారు.
- కిడ్నీలు శరీరంలో వ్యర్ధాలను వడగడుతాయి. ఒకరోజులో దాదాపుగా 1,500 లీటర్ల రక్తాన్ని శుద్ధిచేస్తాయి. ఈ కిడ్నీలు అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్, మితిమీరిన మందుల వినియోగం, మధుమేహంతోనో దెబ్బతింటే రక్త శుద్ధి తప్పనిసరి. దీర్ఘకాలికంగా కిడ్నీ జబ్బులు ఉన్న వారికి జీవితాంతం డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

