ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఈనెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం - మళ్లీ భారీ వర్షాలు...!

ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Published on: Nov 15, 2025, 10:52:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాతావరణశాఖ మరో ముఖ్యమైన ప్రకటన చేసింది. నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్ 21 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించింది.

ఈనెల 21న అల్పపీడనం
ఈనెల 21న అల్పపీడనం

ఏపీకి భారీ వర్ష సూచన…

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం…. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రభావంతో ఈ నెల 24 నుంచి 27 వరకు కోస్తా,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానున్నట్లు తెలిపింది.రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇక అమరావతి వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం… ఇవాళ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక రాయలసీమ ప్రాంతంలోనూ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

పెరుగుతున్న చలి తీవ్రత…

ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా… తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీలు నమోదైంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం… తెలంగాణలో ఈ వారంరోజుల పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక ఈనెల 21వ తేదీన అల్పపీడనం ఏర్పడితే… తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీనిపై ఐఎండీ నుంచి మరిత క్లారిటీ రావాల్సి ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More