కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ఘటనలో… పలువురు సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
20 మందికిపైగా మృతి…!

సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 20 మందికిపైగా కార్మికులు సజీవ దహనమయ్యారు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలిసింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండగా… మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
పేలుడు తీవ్రత దాటికి పక్క గ్రామంలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఓ పాఠశాలలోని స్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన పలువురుని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలిసింది.
సీఎం చంద్రబాబు ఆదేశాలు…
పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలికి వెళ్లాలని హోం మంత్రి అనితను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీనిచ్చారు. సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
పేలుడు ఘటన తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. “పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం” అని పేర్కొన్నారు.
{{/usCountry}}పేలుడు ఘటన తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. “పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం” అని పేర్కొన్నారు.
{{/usCountry}}