AP WhatsApp Governance : త్వరలోనే మనమిత్ర 2.0 వాట్సాప్ సేవలు - ఐటీ మంత్రి లోకేశ్

AP Manamitra WhatsApp Governance :మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని ఐటీ మంత్రి లోకేశ్ ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి త్వరలోనే మనమిత్ర 2.0ను ప్రారంభిస్తామని తెలిపారు.

Published on: Feb 27, 2026, 14:01:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనమిత్ర వాట్సాప్ సేవలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 2.0ను తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించామని తెలిపారు.

త్వరలోనే మనమిత్ర 2.0
త్వరలోనే మనమిత్ర 2.0

యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం - మంత్రి లోకేశ్

వాట్సాప్ సర్సీసులపై వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నామని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఏఐ ఇంటిగ్రేషన్ చేసి ఈ యాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు.

మనమిత్ర వాట్సాప్ సేవలపై శాసనసభలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ... వాట్సాప్ సేవలవల్ల సమయం ఆదా అవుతోందన్నారు. ఎటువంటి ఫీజు లేకుండా సేవలందించడం హర్షణీయమన్నారు. అయితే యాప్ బాగా స్లోగా ఉండటం వల్ల అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారని మాట్లాడారు. ఇతర యాప్ ల మాదిరి ఒకసారి వివరాలు నమోదు చేశాక… మళ్లీ చేసే అవసరం లేకుండా చూడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఉపయోగించుకునేలా మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

ఇందుకు స్పందించిన ఐటీ మంత్రి లోకేష్... “మనమిత్ర ప్లాట్ ఫాంపై మేం ఎలాంటి డేటా స్టోర్ చేయడం లేదు. వాట్సాప్ అనేది ఒక హైవే. డేటా డిపార్ట్ మెంట్ వద్ద ఉంటుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ప్రాసెస్ ను డిజిటలైజ్ మాత్రమే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.

“ఈరోజు అన్ని సేవలు సెల్ ఫోన్ లో ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఇంటి ముంగిటకు వస్తున్నాయి. అదే బటన్ ద్వారా ప్రజలకు అవసరమైన పౌరసేవలు, సర్టిఫికెట్లు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన నాకు యువగళం పాదయాత్ర సమయంలో వచ్చింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సింగిల్ ఫోన్ నెంబర్ ద్వారా పెద్దఎత్తున వాట్సాప్ సేవలు అందిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచాలి, వెనువెంటనే రిసీట్ రావాలి, క్యూ ఆర్ కోడ్ సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. సభ్యులు మినమిత్ర యాప్ కు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. 90రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకొని మనమిత్ర 2.0 ప్రారంభిస్తాం. దీనిపై డోర్ టు డోర్ టు క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది” అని మంత్రి లోకేశ్ చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More