...
...
Next Story

కాకినాడ : హైవేపై కారు బీభత్సం - ముగ్గురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు...!

కాకినాడ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కిర్లంపూడి మండలం సోమవరం దగ్గర హైవేపై బస్సు కోసం వేచి చేస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Nov 8, 2025, 09:43:29 IST
Advertisement

కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలం సోమవరం దగ్గర హైవేపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచివున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా… మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారు ఫ్రంట్‌ టైరు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాకినాడలో ఘోర ప్రమాదం
కాకినాడలో ఘోర ప్రమాదం

ప్రాథమిక వివరాల ప్రకారం…. అన్నవరం నుంచి జగ్గంపేటకు వెళ్తున్న కారు ఫ్రంట్ టైర్ పేలడంతో కారు అదుపు తప్పింది. ఈ క్రమంలోనే సోమవరం దగ్గర హైవేపై ఉన్న బస్సు షెల్టర్‌లోని ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓ బైక్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ హైవేపై కారు దగ్ధం:

ఇక విజయవాడ - హైదరాబాద్ వైవేపై కారు ప్రమాదం జరిగింది. గుండ్రాంపల్లి హైవే యూటర్న్ వద్ద ఇన్నోవా కారు డివైడర్‌ను వేగంగా ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో ఇంజిన్లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎనిమిది మంది ఉండగా… సురక్షితంగా బయటపడ్డారు. కారు రోడ్డుపై పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు, టోల్ సిబ్బంది ట్రాఫిక్‌ను అదుపు చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks