విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతో 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ అనుసంధానం మెరుగుపడనుంది. ఫలితంగా పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. రాష్ట్రాభివృద్ధిలో ఇదోక కీలక పరిణామంగా మారే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్రాభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయిగా నిలవబోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రన్‌వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే… ఈనెల 4వ తేదీన తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ జరుగబోతుంది. ఇందుకోసం విమానాయనశాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మెుదటి దశలో రూ.4,592 కోట్ల వ్యయంతో 22 ఏరో బ్రిడ్జ్‌లు, 81,000 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తారు. 2203 ఎకరాల్లో విమనాశ్రయం విస్తీర్ణం పూర్తి చేస్తారు. ఇతర అవసరాలకు కూడా ప్రభుత్వం మరో 500 ఎకరాలను కేటాయించింది. ఒక్కొటి 3.8 కిలో మీటర్ల పొడవుతో రెండు రన్ వేలు నిర్మిస్తున్నారు. రెండో దశ పనులు తర్వాత జరగనున్నాయి.
2026 మే నెల నుంచే విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జనవరిలో టెస్టింగ్ ఫ్లైట్ ఎగరనుంది. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం కాబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
{{/usCountry}}2026 మే నెల నుంచే విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జనవరిలో టెస్టింగ్ ఫ్లైట్ ఎగరనుంది. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం కాబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
{{/usCountry}}