రాష్ట్రవ్యాప్తంగా రాగల కొన్ని గంటల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది .
ఏపీకి వర్ష సూచన….

ఆదివారం(జూన్ 21) నాటి వాతావరణ అంచనాల ప్రకారం….. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడా చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చు.
మరికొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో కూడా పిడుగులు పడే అవకాశంతో పాటు తేలికపాటి వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వర్షం కురిసే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాగల మూడు గంటల్లో వర్షం - హెచ్చరికలు జారీ:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి రాగల మూడు గంటల కాలానికి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక అలర్ట్‌లను జారీ చేసింది.
- ఆరెంజ్ అలెర్ట్ : పార్వతీపురం మన్యం జిల్లాలో రాగల మూడు గంటల్లో అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేశారు.
- ఎల్లో అలెర్ట్ : శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాలలో రాగల మూడు గంటల వ్యవధిలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ జిల్లాల్లోని ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దన అధికారులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
{{/usCountry}}ఈ జిల్లాల్లోని ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దన అధికారులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
{{/usCountry}}