ఆంధ్రప్రదేశ్‌లో నివాస ధ్రువీకరణ పత్రాల (Residence Certificate) మంజూరు విధానంపై ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి రెవెన్యూ శాఖ క్లారిటీ ఇచ్చింది. సాధారణ పౌరులు నివాస ధ్రువీకరణ కోసం ప్రతిసారీ తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ జీఓ 592లో కీలక మార్పులు చేసింది. ఈ సవరణతో ప్రజలకు ఇబ్బందలు తప్పనున్నాయి.

పౌరుల వద్ద ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో నమోదైన చిరునామానే అధికారిక నివాస ధ్రువీకరణగా పరిగణిస్తారు. వీటి ఆధారంగానే అన్ని రకాల ప్రభుత్వ విధులను, సేవలను పొందేందుకు వెసులుబాటు కల్పించారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఉన్న సామాన్య ప్రజలు ప్రత్యేకంగా తహశీల్దార్ ఆఫీస్ నుండి రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ స్పష్టం చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి, ఆర్మీ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, కేంద్ర ఉద్యోగాల దరఖాస్తుల కోసం మాత్రమే స్థానిక తహశీల్దార్ నుంచి నివాస ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
ఈనెల 16న రెవెన్యూ శాఖ జీఓ 592ను జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరూ తహశీల్దార్ ఆఫీసుల నుంచే నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆధార్, రేషన్ కార్డులనే అడ్రస్ ప్రూఫ్‌గా గుర్తిస్తూ 2015లో జారీ చేసిన జీఓ 581 అమలును నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయంతో మీసేవ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి, అయోమయం వ్యక్తమయ్యాయి. కొన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా జీఓ 592లో తగిన సవరణలు చేస్తూ తాజాగా వివరణ ఇచ్చింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. ప్రవేశాలు, దరఖాస్తుల సమయంలో కుల, ఆదాయ, నివాస సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఇకపై ఉండదు.
{{/usCountry}}ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. ప్రవేశాలు, దరఖాస్తుల సమయంలో కుల, ఆదాయ, నివాస సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఇకపై ఉండదు.
{{/usCountry}}చిన్న పనికి కూడా సర్టిఫికెట్లు అడగడం తగ్గడం వల్ల రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. డిజిటల్ రికార్డులైన ఆధార్ ఆధారంగా పౌర సేవలను వేగవంతంగా అందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. ప్రభుత్వ సేవలు లేదా స్థానిక అవసరాల కోసం పౌరులు తమ ఆధార్ లేదా రేషన్ కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా ధైర్యంగా సమర్పించవచ్చని అధికారులు సూచించారు.